News March 31, 2024
టీసీఎస్‌పై అమెరికా ఉద్యోగుల ఆగ్రహం
భారత ఐటీ దిగ్గజం టీసీఎస్‌పై అమెరికా ఉద్యోగులు మండిపడుతున్నారు. తమపై సంస్థ వివక్ష చూపుతోందని, తమను తొలగించి భారతీయులను నియమించుకుంటోందని తాజాగా ఆరోపించారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. 22మంది ఉద్యోగులు సమాన ఉద్యోగ అవకాశాల కమిషన్‌కు సంస్థపై ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఆరోపణల్ని టీసీఎస్ కొట్టిపారేసింది. ఉద్యోగులకు సమాన అవకాశాల్ని కల్పించడంపై కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పింది.
Similar News
News January 4, 2025
AI చాట్‌బాట్‌లతో ఈ వివరాలు చెప్పొద్దు/అడగొద్దు!
ChatGPT, AI చాట్ బాట్‌లతో వ్యక్తిగత వివరాలు షేర్ చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత రహస్యాలు, ఫైనాన్సియల్ ఇన్ఫో వంటివి షేర్ చేయొద్దంటున్నారు. వీటి నుంచి మెడికల్ అడ్వైస్‌లు తీసుకుని పాటించవద్దని, అవి డాక్టర్లు కాదని అంటున్నారు. మీరు షేర్ చేసే లేదా అడిగే విషయాలు చాట్ బాట్స్ స్టోర్ చేస్తాయని, ఆ డేటా ఇతరులకు చేరే ప్రమాదమూ ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
News January 4, 2025
క్యాబినెట్ భేటీ తర్వాత రైతులకు తీపికబురు: పొంగులేటి
TG: మరికాసేపట్లో జరగబోయే క్యాబినెట్ భేటీ తర్వాత రైతులు తీపి కబురు వింటారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 80 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 30 లక్షల అప్లికేషన్లపై యాప్ ద్వారా సర్వే చేశాం. త్వరలోనే లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేపడతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News January 4, 2025
ఏపీలో మతమార్పిడులు పెరిగాయి: గోకరాజు
AP: వీహెచ్‌పీ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మత మార్పిడులు పెరిగాయని ఆరోపించారు. ఇతర మతస్థులు దేవాలయాల్లో సభ్యులుగా ఉన్నారన్నారు. హిందువుల స్వేచ్ఛ కోసం ఏపీ నుంచే పోరాటం మొదలు పెట్టామని చెప్పారు. ప్రభుత్వాలు ప్రజల నాడి తెలుసుకుని నడుచుకోవాలని సూచించారు. ఆలయాలకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్‌తో రేపు విజయవాడలో హైందవ శంఖారావం సభ నిర్వహిస్తున్నామన్నారు.