News August 10, 2025

VZM: కేజీ చికెన్ రూ.150

image

ఆదివారం వచ్చిందంటే మాంసం ప్రియులకు పండగే. సండే రోజు కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. ఆర్థిక పరిస్థితిని బట్టి కొందరు మటన్ తెచ్చుకుంటే మరికొందరు చికెన్, చేపలతో సండే విందును కంప్లీట్ చేస్తుంటారు. అయితే విజయనగరంలో మటన్ కేజీ రూ.900 వరకు పలుకుతోంది. చికెన్ (స్కిన్) రూ.150, (స్కిన్ లెస్) రూ.170, ఫిష్ రూ.170 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.

Similar News

News August 13, 2025

భారీ వర్షాలు.. విజయనగరం కలెక్టర్ కీలక ఆదేశాలు

image

భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ అంబేడ్క‌ర్ పలు ఆదేశాలు జారీ చేశారు.
➤ గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులంతా ప్రధాన కేంద్రాల్లోనే ఉండాలి
➤ ఏ ఒక్కరికీ సెలవులు ఇవ్వబడవు
➤ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మత్స్యకారుల వేట నిషేధం
➤ నీరు కాలుష్యం కాకుండా పైప్ లైన్స్ తనిఖీ చేయాలి
➤ వైద్య, వ్యవసాయ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్ అధికారులు కూడా సిద్ధంగా ఉండాలి
➤ కలెక్టరేట్లో 08922 236947 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

News August 13, 2025

వచ్చే నెల 13న జాతీయ లోక్ అదాలత్: న్యాయమూర్తి

image

వచ్చే నెల 13న జిల్లా వ్యాప్తంగా జరగనున్న జాతీయ లోక్ అదాలత్ లో వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ చేయించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భబిత సూచించారు. మంగళవారం తన కార్యాలయంలో పలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బీమా క్లైమ్‌లు, సివిల్ దావాలు ఇరు పార్టీల ఆమోదంతో రాజీ చేయించాలని సూచించారు. 12 ప్రమాద బీమా క్లెయిమ్‌లు రాజీకి వచ్చినట్లు స్పష్టం చేశారు.

News August 12, 2025

భారీ వర్షాలు.. అప్రమ్తతంగా ఉండాలని విజయనగరం కలెక్టర్ ఆదేశాలు

image

రానున్న 4 రోజుల‌పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ నుంచి సూచ‌న‌లు వ‌చ్చాయ‌ని, జిల్లా అధికార‌ యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ సోమవారం ఆదేశించారు. మండ‌ల ప్ర‌త్యేకాధికారులు, మండ‌లాధికారులు క్షేత్ర‌స్థాయిలో విస్తృతంగా ప‌ర్య‌టించి ప‌రిస్థితిని స‌మీక్షించాల‌ని సూచించారు. ఎక్క‌డా ఎటువంటి న‌ష్టం వాటిళ్ల‌కుండా ముందస్తు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.