News August 10, 2025
కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

TG: మరికాసేపట్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. రాబోయే 2 గంటల్లో కామారెడ్డి, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూల్, నారాయణ్ పేట్, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతుందని అంచనా వేశారు. మరోవైపు హైదరాబాద్‌లో మధ్యాహ్నం తేలికపాటి, రాత్రి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
Similar News
News August 11, 2025
భారత్‌లో వరల్డ్ కప్.. కౌంట్‌డౌన్ స్టార్ట్

భారత్‌లో మరో క్రికెట్ సంగ్రామానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. Sept 30న మొదలయ్యే మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీకి మరో 50 రోజులే ఉండటంతో నేడు ICC ట్రోఫీ టూర్‌ను లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో ICC ఛైర్మన్ జై షా, BCCI సెక్రటరీ సైకియా, మాజీ స్టార్లు యువరాజ్, మిథాలీ రాజ్, మహిళా క్రికెటర్లు హర్మన్, స్మృతి, జెమీమా పాల్గొన్నారు. కాగా టోర్నీకి అతిథ్యమివ్వనున్న అన్ని నగరాల్లో ట్రోఫీ టూర్ నిర్వహించనున్నారు.
News August 11, 2025
హార్ట్ అటాక్.. పదేళ్ల ముందే పసిగట్టొచ్చు!

భవిష్యత్‌లో వచ్చే గుండె సమస్యలను పదేళ్ల ముందే పసిగట్టొచ్చని ‘JAMA కార్డియాలజీ’లో పబ్లిషైన అధ్యయనం చెబుతోంది. ‘ఒక్కసారిగా ఒంట్లో శక్తి తగ్గడం, తక్కువగా కదలడం, ఎక్కువగా నిద్రపోవడం వంటి లక్షణాలు పదేళ్ల తర్వాత వచ్చే గుండె జబ్బులకు సంకేతాలు. బాడీలో కొలెస్ట్రాల్, BP స్థాయులు పెరగడానికి ముందే వీటి ద్వారా జాగ్రత్త పడొచ్చు’ అని వివరిస్తోంది. ఊరికే కూర్చోకుండా ఎక్కువగా కదలడం అలవాటు చేసుకోవాలని సూచిస్తోంది.
News August 11, 2025
భర్తతో విడాకుల ప్రచారం.. హన్సిక పోస్ట్ వైరల్

భర్త సోహెల్‌తో విడాకుల ప్రచారం నడుమ హీరోయిన్ హన్సిక చేసిన పోస్టు వైరలవుతోంది. ఈ ఏడాది తనకు అనేక పాఠాలను నేర్పిందని ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అదే సమయంలో తెలియని బలం కూడా వచ్చిందని పేర్కొన్నారు. తనకు బర్త్ డే(AUG 9) విషెస్ చెప్పిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కాగా భర్తతో కలిసి ఉన్న ఫొటోలను గతంలో ఆమె డిలీట్ చేశారు. తాజా పోస్ట్ మరోసారి విడాకులపై చర్చ దారితీసింది.