News August 10, 2025

కోహ్లీ, రోహిత్‌కు BCCI బిగ్ షాక్?

image

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు BCCI బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2027 ODI WC ప్లాన్ నుంచి వీరిద్దరిని తప్పించనున్నట్లు సమాచారం. ఒకవేళ వీరు WC ఆడాలనుకుంటే విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనాలనే రూల్ విధిస్తున్నట్లు టాక్. వీరి స్థానంలో కుర్రాళ్లను ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా కోహ్లీ, రోహిత్ వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Similar News

News August 12, 2025

WOW.. మూడు రోజుల్లో 343L పాలిచ్చిన ఆవు

image

బ్రెజిల్‌కు చెందిన హోల్‌స్టెయిన్-ఫ్రైసియన్ జాతి ఆవు ప్రపంచ రికార్డును నెలకొల్పింది. సాధారణ ఆవులు రోజుకు 10 లీటర్ల పాలు ఇస్తుంటే ఇది మాత్రం సగటున రోజుకు 114 లీటర్ల చొప్పున 3 రోజుల్లో 343L పాలు ఉత్పత్తి చేసింది. జెనెటిక్స్, సరైన పోషణ, సంరక్షణ, మోడ్రన్ డెయిరీ టెక్నాలజీ వల్ల ఇది సాధ్యమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముర్రా & నీలి-రవి గేదెలు కూడా ఈ జాతిలానే ఎక్కువ పాలు ఇవ్వగలవు.

News August 12, 2025

స్కూళ్లకు సెలవులపై సీఎం కీలక ఆదేశాలు

image

TG: అల్పపీడనంతో రాబోయే 3 రోజులు రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని బట్టి స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని సూచించారు. ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు <<17383239>>రద్దు<<>> చేయాలని CM ఇప్పటికే ఆదేశించారు.

News August 12, 2025

PIC OF THE DAY.. వందే ‘భారత్’

image

అచ్చం ఇండియా మ్యాప్‌లా కనిపిస్తోంది కదూ! ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లు నడుస్తున్న మార్గం ఇది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్కో ట్రాక్‌తో దేశాన్ని ఇది కలుపుతోందని నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్ ఈ ఫొటోను ట్వీట్ చేశారు. వందే భారత్ రైలు దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తోందని ఆయన Xలో రాసుకొచ్చారు. కాగా ప్రస్తుతం దేశంలో 150కి పైగా వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి.