News August 10, 2025

రేపటి నుంచి నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ

image

TG: ఆగస్టు 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో మాత్రల పంపిణీ చేస్తామని, 1-19 సంవత్సరాలున్న వారంతా ఈ మాత్రలు వేసుకోవాలని సూచించారు. పేగుల్లో ఉండే నులిపురుగులను నివారించి, రక్తహీనతను అధిగమించేందుకు, రోగనిరోధక శక్తి పెంచేందుకు ఇవి దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు.

Similar News

News August 12, 2025

స్కూళ్లకు సెలవులపై సీఎం కీలక ఆదేశాలు

image

TG: అల్పపీడనంతో రాబోయే 3 రోజులు రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని బట్టి స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని సూచించారు. ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు <<17383239>>రద్దు<<>> చేయాలని CM ఇప్పటికే ఆదేశించారు.

News August 12, 2025

PIC OF THE DAY.. వందే ‘భారత్’

image

అచ్చం ఇండియా మ్యాప్‌లా కనిపిస్తోంది కదూ! ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లు నడుస్తున్న మార్గం ఇది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్కో ట్రాక్‌తో దేశాన్ని ఇది కలుపుతోందని నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్ ఈ ఫొటోను ట్వీట్ చేశారు. వందే భారత్ రైలు దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తోందని ఆయన Xలో రాసుకొచ్చారు. కాగా ప్రస్తుతం దేశంలో 150కి పైగా వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి.

News August 12, 2025

ఈ పనులు చేస్తున్నారా?.. వెంటనే ఆపేయండి

image

రోజూ చేసే కొన్ని పనులు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయనే విషయం మీకు తెలుసా? ‘భోజనం తింటూ నీరు తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది. దిండు కింద ఫోన్ పెట్టుకుంటే నిద్రకు అంతరాయం కలుగుతుంది. ఎక్కువసేపు కూర్చుంటే రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. చాలా వేడిగా ఉన్న ఆహారం తింటే అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చెవిలో కాటన్ స్వాబ్స్ పెడితే వినికిడి శక్తి కోల్పోయే అవకాశం ఉంది’ అని హెచ్చరిస్తున్నారు.