News August 10, 2025
HYDలో వర్షం ఎఫెక్ట్.. పలు విమానాలకు అంతరాయం

సాంకేతిక సమస్యలు, వాతావరణ ప్రతికూలత వల్ల నిన్న పలు విమానాల రాకపోకల్లో అంతరాయం కలిగింది. అహ్మదాబాద్ నుంచి HYDకు వచ్చే విమానం 5 గంటలు ఆలస్యంగా వచ్చింది. శంషాబాద్- సాయంత్రం రస్‌అల్‌ఖైమానా బయలుదేరాల్సిన విమానం గంట ఆలస్యంగా బయలుదేరింది. భారీ వర్షం కారణంగా షార్జా వెళ్లాల్సిన విమానం గంట ఆలస్యంగా టేకాఫ్‌తీసుకుంది. మరో 2 దేశీయ విమానాలు గంట ఆలస్యంగా టేకాఫ్ అయ్యాయి.
Similar News
News August 12, 2025
ఉస్మానియా యూనివర్సిటీ ఎంసీఏ పరీక్షల తేదీల ఖరారు

HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసీఏ రెండు, నాలుగో సెమిస్టర్ మెయిన్, అన్ని సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల తేదీల పూర్తి వివరాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు. SHARE IT
News August 12, 2025
చందానగర్ ఖజానా జువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి

HYD చందానగర్ ఖజానా జువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి లభించింది. నగర శివారులో ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. దోపిడీ ఘటనపై నిందితులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దుండగులు వాడిన వెపన్స్, బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. కాగా 15 నిమిషాల్లో దోపిడీ చేసి దొంగలు పరారయ్యారు.
News August 12, 2025
కొడంగల్ అభివృద్ధిపై HYDలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

కొడంగల్ నియోజకవర్గంలోని పలు ఆలయాల అభివృద్ధిపై అధికారులతో CM రేవంత్ రెడ్డి ఈరోజు HYDలో సమీక్షించారు. కొడంగల్‌లోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, దౌల్తాబాద్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి గుడి, కోస్గిలోని శివాలయం, వేణుగోపాల స్వామి గుడిని సమూలంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 6 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ తరహాలో కొడంగల్‌లోని చారిత్రక శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి చేయాలన్నారు.