News August 10, 2025
HYD: గురూ.. మీరూ ‘రాఖీ’ మిస్ అయ్యారా?

సోదర సోదరీమణుల అనురాగ ఆప్యాయతకి రాఖీ ప్రతీకగా జరుపుతారు. HYD, ఉమ్మడి రంగారెడ్డిలో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపిలేని వర్షంతో దూరప్రాంతాల నుంచి వచ్చే అక్కాచెల్లెళ్లు రాక సోదరులు దిగాలుగా ఎదురుచేశారు. పలుచోట్ల ప్రయాణం మధ్యలో ఇబ్బందులు పడ్డా.. అర్ధరాత్రి ఇంటికి చేరి కట్టారు. చిన్నప్పటి నుంచి ఒక్కసారీ మిస్ కానీ ‘రాఖీ’ ఈ ఏడాది వర్షం కారణంగా కట్టుకోలేకపోయామని బాధపడ్డారు. మీరూ ఈ ఏడాది రాఖీ మిస్ అయ్యారా?
Similar News
News August 12, 2025
ఓయూ పీహెచ్‌డీ కోర్స్ వర్క్ పరీక్షల ఫలితాల విడుదల

HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీహెచ్‌డీ కోర్స్ వర్క్/ ప్రీ పీహెచ్‌డీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని ఫ్యాకల్టీల పరిధిలోని పలు విభాగాల పీహెచ్‌డీ కోర్స్ వర్క్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
News August 12, 2025
ఉస్మానియా యూనివర్సిటీ ఎంసీఏ పరీక్షల తేదీల ఖరారు

HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసీఏ రెండు, నాలుగో సెమిస్టర్ మెయిన్, అన్ని సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల తేదీల పూర్తి వివరాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు. SHARE IT
News August 12, 2025
చందానగర్ ఖజానా జువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి

HYD చందానగర్ ఖజానా జువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి లభించింది. నగర శివారులో ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. దోపిడీ ఘటనపై నిందితులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దుండగులు వాడిన వెపన్స్, బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. కాగా 15 నిమిషాల్లో దోపిడీ చేసి దొంగలు పరారయ్యారు.