News August 10, 2025

ఓపన్ వర్సిటీ PhD అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పలు సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అకడమిక్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ జి.పుష్పా చక్రపాణి తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లేట్ ఫీతో సెప్టెంబర్‌ 4 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. వివరాలకు 040–23544741, 23680411 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.

Similar News

News August 10, 2025

HYD: పప్పులోకైనా, నాన్‌వెజ్‌కైనా చింతచిగురు అదుర్స్

image

చింత చిగురు రుచి చూస్తే దాన్ని మరిచిపోరు. ఇందులో కారం, ఉప్పు వేసుకొని తింటే ఆహా అనాల్సిందే. పప్పులోకైనా, నాన్‌వెజ్‌లోకైనా దీని కాంబినేషన్ అదిరిపోతుంది. కాంక్రీట్ జంగల్‌ విస్తరిస్తుండటంతో చింతచెట్ల సంఖ్య నానాటికి తగ్గిపోతుంది. చెట్ల కొరతతో దీని ధర పెరిగింది. శివారు నుంచి తెచ్చి HYDలో విక్రయిస్తున్నారు. కిలో రూ.1,200 వరకు పలుకుతోంది. దీంట్లో ఔషధ గుణాలు ఉంటాయని స్టడీ చెబుతోంది. మీరూ దీన్ని తిన్నారా?

News August 10, 2025

కొంపల్లి: జర భద్రం.. మాయ‘దారి’ మనకొద్దు

image

సుచిత్ర- కొంపల్లి- మేడ్చల్ దారిలో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో లేని దారిని సృష్టించి బైక్‌లను ఫుట్‌పాత్, డ్రైనేజీ మీద నుంచి వెళుతున్నారు. ఇలా వెళ్లడం ప్రమాదకరం అని అధికారులు హెచ్చరిస్తున్నారను. దారి పొడవునా రాకపోకలకు ఇబ్బంది నెలకొందని ఈ తరహా ప్రయాణాలతో ఇతరులకు ప్రమాదం జరిగుతుందని అధికారులు చెబుతున్నారు. జర ఉన్న దారిలో వెళ్లి ఉన్నవారికి తోడుగా ఉండు సోదరా అని పలువురు SMలో కామెంట్లు చేస్తున్నారు.

News August 10, 2025

HYD: రాజగోపాల్‌రెడ్డిపై క్రమశిక్షణా కమిటీ చర్యలు?

image

నాంపల్లిలోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, వరంగల్ నేత కొండా మురళీ వ్యాఖ్యలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. వీరిపై ఏదో రకంగా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.