News August 10, 2025
రైతుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం: అచ్చెన్నాయుడు

రైతుల అభ్యున్నతి, వ్యవసాయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం కోటబొమ్మాళి మండలం నిమ్మడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రైతు అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లాలోని రైతులకు రూ.186 కోట్లు అన్నదాత సుఖీభవ నిధులు అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పాల్గొన్నారు.
Similar News
News August 13, 2025
విజయనగరం పైడితల్లమ్మ పండగ తేదీలు ఇవే

ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబర్ 7న(మంగళవారం) ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శిరీష తెలిపారు. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 22 వరకు మండల దీక్ష ప్రారంభం అవుతుందన్నారు. అక్టోబర్ 6న (సోమవారం) తొలేళ్ల ఉత్సవం, 14న తెప్పోత్సవం, 21న ఉయ్యాల కంబాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. >Share it
News August 13, 2025
ఢిల్లీలో జరిగే వేడుకలకు సారవకోట సీడీపీఓకు ఆహ్వానం

ఢిల్లీలో ఈ నెల 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలకు సారవకోట ఐసీడీఎస్ సీడీపీఓ వంశీ ప్రియకు ఆహ్వానం అందింది. ఢిల్లీలోని రెడ్ పోర్ట్‌లో నిర్వహించే ఉత్సవాలలో ఆమె బయల్దేరనున్నారు. తనని ఎంపిక చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.
News August 13, 2025
శ్రీకాకుళానికి ప్రాచీనకాలంలో ఉన్న పేరు ఇదే..!

జిల్లా ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా చరిత్రకు సంబంధించిన ఒక అద్భుతమైన శాసన సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఈ శిలా శాసనంలో ప్రాచీనకాలంలో శ్రీకాకుళం పేరు “సికకోలీ గడ” అని ఉన్నట్లు గుర్తించారు. పర్లాకిమిడికి చెందిన ఎపిగ్రఫిస్ట్ బిష్ణు మోహన్ గుర్తించి చదివారు. బిష్ణు మోహన్ చేస్తున్న కృషికి ఎమ్మెల్యే శంకర్ ప్రత్యేకంగా అభినందించారు.