News August 10, 2025

HCA వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీలపై సీఐడీకి ఫిర్యాదు

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్, జాయింట్ సెక్రటరీ బసవరాజుపై హెచ్సీఏ మాజీ కోశాధికారి చిట్టి శ్రీధర్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ మల్టీపుల్ క్లబ్ ఓనర్షిప్‌తో HCA ఎన్నికల్లో గెలిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దల్జీత్ సింగ్ కుటుంబం ఆధ్వర్యంలో అమీర్‌పేట్ క్రికెట్ క్లబ్, ఖాల్సా క్లబ్లు నడుస్తున్నాయన్నారు. మల్టీపుల్ క్లబ్ ఓనర్షిప్ నిబంధనలకు విరుద్ధమన్నారు.

Similar News

News September 14, 2025

గూగుల్ తల్లే.. ‘గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే’కు ఆధారం

image

గూగుల్ మ్యాప్.. మనం ఎప్పుడైనా.. ఎక్కడికైనా వెళ్లడానికి దీనిపైనే ఆధారపడతాం. అయితే ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గూగుల్ తల్లినే నమ్ముకున్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణానికి సంబంధించి ఎన్ని కిలో మీటర్ల దూరం ఉంటుందనే విషయంపై గూగుల్ మ్యాప్ ఆధారంగా ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ రోడ్డు దాదాపు 210 నుంచి 230 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది.

News September 14, 2025

HYD భార్య గొంతుకోసిన భర్త.. ఆస్పత్రికి తరలింపు

image

నాగోల్‌‌లో భార్య మహాలక్ష్మి గొంతును భర్త వేణుగోపాల్ కత్తితో కోశాడు. దీంతో ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏడాది క్రితం మహాలక్ష్మితో వివాహం జరగగా.. అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిన అతడు మారకపోగా.. ఈరోజు ఘాతుకానికి ఒడిగట్టాడు. కాగా, వేణుగోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 14, 2025

HYD: విద్యార్థినుల ఫోన్ నంబర్లు వారికెలా వచ్చాయి?

image

మహిళా వర్సిటీ విద్యార్థినులను వేధిస్తున్న ముగ్గురు యువకులను సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ముగ్గురికీ విద్యార్థినుల ఫోన్ నంబర్లు ఎలా వచ్చాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. నిందితుల్లో ఒకరు కార్ డ్రైవర్, మరొకరు హౌస్ కీపింగ్ బాయ్, మరొకరు డెలివరీ బాయ్. అంతమంది నంబర్లను ఎలా సేకరించారనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు.