News August 10, 2025

మా నాన్న చెప్పులు, వైర్లతో కొట్టేవాడు: గాయత్రి గుప్తా

image

చిన్నప్పుడు తాను పడ్డ కష్టాలను సినీ నటి గాయత్రి గుప్తా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘మా నాన్నకు ఐదుగురు కుమార్తెలం. ఆయనకు అబ్బాయి కావాలని ఉండేది. మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నా అమ్మాయే పుట్టింది. అప్పటినుంచి నన్ను చీపురు, చెప్పులు, వైర్లతో కొట్టి కారం వేసేవాడు. మేం రిచ్ అయినా పాకెట్ మనీ ఇవ్వలేదు. నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా మా నాన్నలాంటివాడే. అందుకే విడాకులు ఇచ్చా’ అంటూ చెప్పుకొచ్చారు.

Similar News

News August 20, 2025

వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్, కోహ్లీ పేర్లు మిస్సింగ్!

image

ICC వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రోహిత్, కోహ్లీ పేర్లు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వారం క్రితం రోహిత్ 2, కోహ్లీ 4వ స్థానాల్లో ఉన్నారు. తాజా ర్యాంకింగ్స్‌లో TOP-100లో కూడా లేరు. దీనికి టెక్నికల్ గ్లిచ్ కారణమా లేదా వారి రిటైర్మెంట్‌కు సంకేతమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూల్ ప్రకారం 9-12 నెలలు ODIs ఆడకపోతే ర్యాంకింగ్స్ నుంచి తొలగిస్తారు. చివరిగా వీరిద్దరూ 2025 మార్చిలో (CT) ODIs ఆడారు.

News August 20, 2025

అలా చేస్తే ఊరుకునేది లేదు: బీఆర్ నాయుడు

image

AP: తిరుమలలో తప్పు చేస్తే మాట్లాడాలని, లేని పోని విమర్శలు సరికాదని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తప్పు చేయకుండా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు. తిరుమల వచ్చి తలనీలాలు సమర్పించి జగన్, భారతి ప్రసాదాలు తింటారా? ప్రతి చిన్న విషయాన్ని కావాలనే పెద్దది చేసి తిరుమలపై విమర్శలు చేస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి TTD ప్రతిష్ఠను దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నారు’ అని ఆయన మండిపడ్డారు.

News August 20, 2025

త్వరలో మోదీ-పుతిన్-జిన్‌పింగ్ భేటీ!

image

రష్యా-భారత్-చైనా మధ్య సంబంధాలు బలపడాల్సిన అవసరముందని భారత్‌లోని రష్యన్ అంబాసిడర్ రోమన్ బాబుష్కిన్ అభిప్రాయపడ్డారు. ఆసియాలోని 3 అతిపెద్ద దేశాలు ఒకేతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. త్రైపాక్షిక(మోదీ-పుతిన్-జిన్‌పింగ్) సమావేశం ఎప్పుడన్న ప్రశ్నకు ‘అతి త్వరలో.. సరైన సమయం కోసం వేచి చూడాలి’ అని స్పందించారు. US టారిఫ్స్ దృష్ట్యా ఆయిల్‌పై భారత్‌కు రష్యా మరో 5% డిస్కౌంట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.