News March 31, 2024

అచ్చెన్నాయుడు తల్లి కన్నుమూత

image

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు తల్లి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కింజరాపు కళావతమ్మ (90) ఇవాళ మధ్యాహ్నం చనిపోయారు. కళావతమ్మకు ముగ్గురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు. ఆమె మరణంతో కింజరాపు ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News September 30, 2025

పిట్టవానిపేట సముద్ర తీరంలో గుర్తు తెలియని మృతదేహం

image

సంతబొమ్మాళి మండలం పిట్టవానిపేట గ్రామ సముద్ర రేవులో గుర్తుతెలియని మృతదేహం మంగళవారం కలకలం రేపింది. స్థానిక మత్స్యకారులు సముద్ర తీరంలో ఈ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం ఉబ్బి ఉండడంతో కొద్ది రోజులు క్రితం మృతి చెంది ఉండవచ్చునని మత్స్యకారులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమచారం మేరకు సంతబొమ్మాళి ఎస్ఐ సింహాచలం ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.

News September 30, 2025

కోటబొమ్మాళి: అర్హత కలిగిన ప్రతి పేదవానికి కాలనీ ఇల్లు

image

అర్హత కలిగిన ప్రతి పేదవానికి కాలనీ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి మండలం నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కోటబొమ్మాళి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే చంద్రబాబు ధ్యేయం అన్నారు. పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చన్న స్పష్టం చేశారు.

News September 30, 2025

మెళియాపుట్టి: ప్రైవేట్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

image

ప్రైవేట్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మెళియాపుట్టిలో మంగళవారం ఉదయం జరిగింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో పలాస నుంచి పర్లాకిమిడి వైపు వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఎదురుగా వస్తున్న జేసీబీని తప్పించబోయిన రహదారిపై వెళ్తున్న పాదచారుడ్ని ఢీకొట్టంది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు చాపర గ్రామానికి చెందిన లక్ష్మణరావుగా పోలీసులు గుర్తించారు.