News August 10, 2025
రేపే చిత్తూరుకు బీజేపీ అధ్యక్షుడి రాక

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చిత్తూరులో సోమవారం పర్యటించనున్నట్లు ఆ పార్టీ నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు మిట్టూరులో ఛాయ్ పే చర్చ, 10 గంటలకు కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి నివాళి, అనంతరం వివేకానంద విగ్రహం నుంచి తిరంగా ర్యాలీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12గంటలకు నాయకులతో, సాయంత్రం 4గంటలకు మీడియా, మేధావులతో సమావేశం నిర్వహిస్తారు.
Similar News
News August 13, 2025
డ్రగ్స్ రహిత చిత్తూరుగా మారుస్తాం: కలెక్టర్

చిత్తూరు జిల్లాను డ్రక్స్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. నషా భారత్ కార్యక్రమంలో భాగంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువత చెడు మార్గాన వెళ్లకుండా తల్లిదండ్రులు చూడాలన్నారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా, సరఫరా చేసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
News August 13, 2025
వీకోట: అదుపుతప్పి చెరువులో పడి బాలుడి మృతి

చెరువులో పడి ఆరో తరగతి విద్యార్ధి మృతిచెందిన సంఘటన వి.కోట మండలంలో జరిగింది. యాలకల్లు గ్రామానికి చెందిన నాగరాజు, కల్పన దంపతుల కుమారుడు భార్గవ్ (11) వికోట పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన అనంతరం గ్రామ సమీపంలోని చెరువు వద్దకి వెళ్లి అదుపుతప్పి పడిపోయాడు. స్థానికులు గుర్తించి బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడు.
News August 12, 2025
CTR: మూడుకు చేరిన మృతుల సంఖ్య

పళ్లిపట్టు వద్ద మంగళవారం జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. GDనెల్లూరు(M) గోవిందరెడ్డిపల్లికి చెందిన YCP నాయకుడు సురేంద్ర రెడ్డి కుటుంబంతో కలిసి కావడి మొక్కులు చెల్లించేందుకు తిరుత్తణికి కారులో బయల్దేరారు. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో వాహనం బోల్తా కొట్టింది. ఆయన తమ్ముడు చిన్నబ్బరెడ్డి, పద్మ అక్కడికక్కడే మృతిచెందారు. నెలలైనా నిండని మనవడు సైతం చనిపోవడంతో మృతుల సంఖ్యకు మూడుకు చేరింది.