News August 10, 2025

మా సంకల్పాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నా: KTR

image

TG: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ నిర్మాణం పూర్తి కావొస్తుండటంపై మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘KCR హయాంలో ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాం. నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, సిద్దిపేటలో ఐటీ హబ్‌లు ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఆదిలాబాద్ కూడా ఈ లిస్టులో చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం మా సంకల్పాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నా’ అని Xలో ట్వీట్ చేశారు.

Similar News

News August 10, 2025

రేపు పిడుగులతో కూడిన వర్షాలు: APSDMA

image

AP: దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. బుధవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

News August 10, 2025

టాలీవుడ్‌లో స్టైల్ ఐకాన్స్ వారే: సాయి‌ధరమ్ తేజ్

image

టాలీవుడ్‌లో మోస్ట్ స్టైల్ ఐకాన్ రామ్ చరణ్ అని మెగా హీరో సాయి‌ధరమ్ తేజ్(SDT) చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా మరో స్టైలిష్ యాక్టర్ అని తెలిపారు. నిన్న జరిగిన ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 వేడుకలో మోస్ట్ డిజైరబుల్(మేల్) అవార్డును SDT సొంతం చేసుకున్నారు. అవార్డును తన తల్లికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆరెంజ్ మూవీలో RC లుక్స్ తన ఆల్‌టైం ఫేవరెట్ అని పేర్కొన్నారు.

News August 10, 2025

హోరాహోరీ ఫైట్.. ఇద్దరు బాక్సర్లు మృతి

image

జపాన్‌ బాక్సింగ్ ఈవెంట్లో తీవ్ర విషాదం నెలకొంది. టోక్యో కొరాకువెన్ హాల్ పోటీల్లో ఇద్దరు యువ బాక్సర్లు గాయాలపాలై మృతిచెందారు. ఈనెల 2న షిగెటోషీ కొటారీ(28) 12 రౌండ్ల హోరాహోరీ ఫైట్ తర్వాత రింగ్‌లోనే కుప్పకూలిపోయారు. తర్వాతి రోజు మరో మ్యాచ్‌లో హిరోమాసా ఉరకావా(28) ఫైనల్ రౌండ్లో నాకౌట్ అయ్యారు. వీరిద్దరూ బ్రెయిన్ ఇంజూరీస్‌తోనే మరణించడం గమనార్హం. ఈ విషయాన్ని వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ ఇవాళ వెల్లడించింది.