News August 10, 2025
పార్వతీపురం: PGRS అర్జీల వివరాలు తెలుసుకోవచ్చు

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమర్పించిన అర్జీల వివరాలను 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. మీకోసం వెబ్సైట్‌లోనూ అర్జీలు నమోదు చేయవచ్చని వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
Similar News
News August 13, 2025
BREAKING: ఖమ్మం: కారు బోల్తా.. ఇద్దరు మృతి

కారు అదుపుతప్పి బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన ముదిగొండ మండలంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ మురళి తెలిపిన వివరాలిలా.. ముదిగొండ మండలం గోకినేపల్లి జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం అదుపుతప్పి ఓ కార్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఖమ్మం నగరానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
News August 13, 2025
సూర్యపేట: కలెక్టర్ కారులో మోడల్ స్కూల్ విద్యార్థులు

మఠంపల్లి బ్రిడ్జి వద్ద నీరు పొంగి ఉదృతంగా ప్రవహించడంతో రఘునాథపాలెం మోడల్ స్కూల్ విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. దీంతో అటుగా వెళ్తున్న సూర్యపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ విద్యార్థులను తన కారు ఎక్కించుకుని మఠంపల్లి మోడల్ స్కూల్ వద్ద క్షేమంగా తీసుకెళ్లి దించారు.
News August 13, 2025
GWL: ‘మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చాలి’

మహిళలను ఆర్థికాభివృద్ధికి స్వయం సహాయక సంఘాల్లో చేర్చాలని గద్వాల అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు సూచించారు. బుధవారం ఐడీఓసీ మందిరంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటు శిక్షణలో పాల్గొన్నారు. ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, స్వయం సహాయక సంఘాల్లో ఉంటే వారికి లబ్ధి చేకూరుతుందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం అభివృద్ధి చెందుతుందన్నారు.