News August 10, 2025
రేపు భద్రాద్రి కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం

రేపు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ప్రజలు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని చెప్పారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News August 13, 2025
ఈనెల 25న వర్ధన్నపేటలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర

ఈనెల 25న వర్ధన్నపేట నియోజకవర్గంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రెండవ విడత పాదయాత్ర నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 25న సాయంత్రం 5 గంటలకు జనహిత పాదయాత్రతో నియోజకవర్గంలోకి చేరుకుంటారని, 26న ఉదయం 7 నుంచి 10 గంటల వరకు శ్రమదానం నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం 10:30కు వరంగల్ జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమ్మేళనం నిర్వహించనున్నారు. కాగా, పాదయాత్ర రూట్ ఖరారు కావాల్సి ఉంది.
News August 13, 2025
సిద్దిపేట: ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న సీఎం

నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్, మంత్రి తుమ్మల ఆయిల్ పామ్ సాగుకు ప్రాధాన్యం ఇచ్చి రైతులకు లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇంజినీర్లు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
News August 13, 2025
సంగారెడ్డి: అత్యవసరం అయితే ఫోన్ చేయండి: ఎస్పీ

రాబోయే 72 గంటలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లు ఎస్పీ పారితోష్ పంకజ్ మంగళవారం తెలిపారు. అత్యవసరం అయితే 100, 87126 56739 నంబర్లకు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. ఫోన్ చేస్తే వెంటనే సహాయక చర్యలు చేపడతారని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు.