News August 10, 2025

అలంపూర్ ఆలయ అర్చకులకు నోటీసులు

image

దేవాదాయశాఖ నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ కార్యక్రమాలలో పాల్గొన్నందుకు గాను జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల అర్చకులకు నోటీసులు జారీ చేసినట్లు ఆలయ ఈవో పురేందర్ తెలిపారు. ఈ నెల 6న డోన్‌లో ఒక రాజకీయ నాయకుడి ప్రైవేట్ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారని, ఇది SMలో వైరల్ కావడంతో దేవాదాయశాఖ సీరియస్‌గా స్పందించిందని చెప్పారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా అర్చకులకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు.

Similar News

News August 13, 2025

పైరసీ పెరగడానికి నిర్మాతలు, ప్రభుత్వాలే కారణమా?

image

సినిమా పైరసీ పెరగడానికి నిర్మాతలు, GOVTలే పరోక్షంగా కారణమనే సమాధానాలు అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. కొత్త సినిమాలకు ప్రత్యేక రేట్లతో స్పెషల్ <<17383707>>GOలిస్తూ <<>>జేబులు గుల్ల చేస్తున్నాయి. ఒక టికెట్ ₹500-800 అయితే, పాప్‌కార్న్ ఖర్చు కలిపి ఇద్దరు వెళ్తే ₹2000 ఆవిరి కావాల్సిందే. OTTలో చూడాలంటే ఆ రేట్లు భరించలేక ప్రతీ సినిమాకు స్పెషల్ రేట్లు పెట్టలేక పైరసీ వైపు మొగ్గుచూపుతున్నట్లు అభిమానులు చెబుతున్నారు.

News August 13, 2025

HYD: ఇంజనీరింగ్ వైపు ఆసక్తి తగ్గుతుందా?

image

ఇంజినీరింగ్ విద్య వైపు ఆసక్తి తగ్గుతుందా? అంటే ప్రస్తుత గుణాంకాలతో అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో 55.8% మాత్రమే సీట్ల భర్తీ అయ్యాయి. మిగిలినవి స్పాట్ కౌన్సెలింగ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోలిస్తే 15 శాతానికిపైగా సీట్లు గ్రేటర్ పరిధిలో మిగిలాయి. మరోవైపు B TECH ఇంజినీరింగ్ సీట్లు సైతం మిగలటం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

News August 13, 2025

VKB: ‘భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి’

image

భారీ వర్షాల నేపథ్యంలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా అన్ని శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాగులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందువల్ల క్షేత్రస్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలన్నారు.