News March 31, 2024
ఫోన్ ఆర్డర్ చేస్తే రాయి వచ్చింది

ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్ బుక్ చేయగా రాయి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన అతడు రూ.22 వేల విలువైన స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. ప్యాక్ ఇంటికి రాగానే ఓపెన్ చేయగా లోపల రాయి కనిపించింది. దీనిపై కంపెనీకి ఫిర్యాదు చేయగా వారు సరిగా స్పందించలేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫ్లిప్‌కార్ట్ క్షమాపణలు చెప్పింది.
Similar News
News March 14, 2026
ప్రజల్లో భయాందోళనలకు కాంగ్రెస్ యత్నం: మోదీ

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం దేశ ప్రజలపై పడకుండా చర్యలు తీసుకుంటున్నామని PM మోదీ తెలిపారు. ఇలాంటి సందర్భంలో భయాందోళనలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అస్సాంలోని సిల్చార్‌లో మాట్లాడుతూ ‘దేశ ప్రయోజనాల విషయంలో INC మళ్లీ విఫలమైంది. నాపై దుర్భాషలాడేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. దేశాభివృద్ధిని జీర్ణించుకోలేని శక్తుల చేతుల్లో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారుతోంది’ అని పేర్కొన్నారు.
News March 14, 2026
ఒక్కరోజే 2,37,123 గ్యాస్ సిలిండర్ల పంపిణీ

TG: డొమెస్టిక్ సిలిండర్ల డెలివరీకి సమస్య రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా 2,37,123 గ్యాస్ సిలిండర్లు పంపిణీ అయ్యాయి. సాధారణంగా జరిగే రోజువారీ సగటు పంపిణీ కంటే ఇది 12K సిలిండర్లు అధికం కావడం విశేషం. IOCL 83,166, HPCL 88,257, BPCL 65,700 గ్యాస్ సిలిండర్లను సరఫరా చేశాయి. GOVT కఠిన చర్యల ఫలితంగా బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్టపడింది.
News March 14, 2026
ఇన్‌స్టాలో అవి చూసి మోసపోకండి!

ఇన్‌స్టాలో ఏదైనా వస్తువు కనిపించగానే అరే.. బాగుందే అనుకుంటాం. రేట్ కూడా తక్కువే ఉంది కదా కొందామని చూస్తే COD ఉండదు. వెంటనే ఆన్‌లైన్ పేమెంట్ చేసి బుక్ చేస్తాం. కానీ ఎన్నిరోజులైనా అది మీకు డెలివరీ అవ్వదు. ఎందుకంటే అది ఫేక్ షాపింగ్ వెబ్‌సైట్. ఇలాంటి సైట్లు కుప్పలుగా పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా మహిళలు వీటి బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. టెంప్ట్ అవ్వకుండా ట్రస్టెడ్ సైట్లలోనే షాపింగ్ చేయండి.


