News August 10, 2025

పులివెందులలోని పోలింగ్ కేంద్రాలన్నీ సమస్యాత్మకమే: కడప ఎస్పీ

image

AP: ఈ నెల 12న జరగనున్న పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నిక పోలింగ్‌కు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు కడప SP అశోక్ కుమార్ తెలిపారు. ‘రెండు ప్రాంతాల్లో 1,100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం. పులివెందుల జడ్పీటీసీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలన్నీ సమస్యాత్మకం. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయి. ఈ 2 మండలాల్లో స్థానికేతరులు ఉండకూడదు’ అని SP ఆదేశించారు.

Similar News

News August 13, 2025

పులివెందుల: 2 కేంద్రాల్లో రీపోలింగ్

image

AP: పులివెందుల ZPTC ఉప ఎన్నికల్లో భాగంగా 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ ఆదేశించింది. అచ్చవెల్లి, కొత్తపల్లెలో ఇవాళ రీపోలింగ్ నిర్వహించనున్నారు. 3, 14 కేంద్రాల్లో ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు రీపోలింగ్ జరగనుంది. ఈ కేంద్రాల్లో 2 వేల మంది ఓటర్లు ఉన్నారు. నిన్న జరిగిన పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాశ్ సహా వైసీపీ శ్రేణులు ఆరోపించిన విషయం తెలిసిందే.

News August 13, 2025

E20 పెట్రోల్‌పై ఆ ప్రచారాలు తప్పు: కేంద్రం

image

E20 పెట్రోల్‌పై వస్తున్న <<17378231>>పుకార్లను<<>> కేంద్రం కొట్టిపారేసింది. దీని వల్ల పొల్యూషన్ తగ్గడమే కాకుండా వాహనాల పికప్ కూడా పెరుగుతుందని వెల్లడించింది. E10 పెట్రోల్‌తో పోలిస్తే 30% తక్కువ కార్బన్ ఉద్గారాలు వెలువడతాయని పేర్కొంది. మైలేజీ తగ్గుతుందన్న ప్రచారంలో నిజం లేదంది. డ్రైవింగ్ విధానం, వాహనం మెయింటెనెన్స్, టైర్ ప్రెషర్, AC లోడ్ వంటి వాటిపై మైలేజీ ఆధారపడి ఉంటుందని కేంద్రం వివరించింది.

News August 13, 2025

సెమీ కండక్టర్ రంగంలో వేగంగా అడుగులు: మోదీ

image

భారతదేశం <<17381479>>సెమీ కండక్టర్<<>> రంగంలో వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. AP, ఒడిశా, పంజాబ్‌కు సెమీ కండక్టర్ యూనిట్లు మంజూరు కావడంపై తెలుగులో ట్వీట్ చేశారు. ‘ఏపీ, ఒడిశా, పంజాబ్‌లో కొత్త యూనిట్ల ఏర్పాటుకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం తయారీ సామర్థ్యాన్ని పెంచుతుంది. అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సృష్టిస్తుంది. ప్రపంచ సరఫరా వ్యవస్థలో దేశాన్ని కీలక పాత్రధారిగా ఉంచుతుంది’ అని తెలిపారు.