News March 31, 2024

తూ.గో. జిల్లాలో తొలిసారి బరిలో.. గెలిచి నిలిచేనా..?

image

ఉమ్మడి తూ.గో.జిల్లాలోని 19స్థానాల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచిన అభ్యర్థుల్లో తొలిసారి పోటీచేస్తున్నవారు 9 మంది ఉండటం విశేషం. జనసేన నుంచి బత్తుల రామకృష్ణ, గిడ్డి సత్యనారాయణ, దేవవరప్రసాద్, YCP నుంచి పిల్లి సూర్యప్రకాశ్, TDP నుంచి యనమల దివ్య, వాసంశెట్టి సుభాష్, మిర్యాల శిరీష, ఆదిరెడ్డి వాసు, BJP- శివకృష్ణంరాజు ఉన్నారు. గెలిస్తే తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

Similar News

News September 30, 2025

ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ ప్రాధాన్యత: కలెక్టర్

image

అక్టోబర్ 4,5 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లాలో బ్రెజిల్ ప్రతినిధుల బృందం పర్యటించనుందని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం తెలిపారు. ఈ పర్యటన ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ ప్రాధాన్యతను తెచ్చిపెడుతుందన్నారు. బ్రెజిల్ COP–30 ఆతిథ్యం, భారతదేశ G20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో ఇది ప్రత్యేకంగా నిలవనుంది. బ్రెజిల్ బృందానికి శ్రీమతి వివియన్ లిబోరియో డి అల్మెయిడా నాయకత్వం వహిస్తారని కలెక్టర్ వివరించారు.

News September 30, 2025

తూ.గో జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: కలెక్టర్

image

తూ.గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి దసరా పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వచ్ఛతా హీ సేవా, స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమాల స్ఫూర్తితో, సంకల్ప దీక్షతో విజయ దశమి, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా మన ఇంటి నుంచి అన్ని ప్రదేశాలలో స్వచ్ఛత పాటించాలని సూచించారు.

News September 29, 2025

అఖండ గోదావరికి అయిదు వంతెనల హారం

image

రాజమండ్రి- కొవ్వూరును కలుపుతూ గోదావరి నదిపై నిర్మించిన ఐదు వంతెనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 1975లో నిర్మించిన ఆసియాలోనే రెండో అతిపెద్దదైన రోడ్డు కమ్ రైల్వే వంతెన, బ్రిటిష్ హయాంలోని హేవలాక్ బ్రిడ్జి గోదావరికి మణిహారాలుగా ఉన్నాయి. ఆర్చ్ ఆకారపు రైలు వంతెన, 2015లో నిర్మించిన 4 లైన్ల రోడ్డు వంతెన, ధవళేశ్వరం ఆనకట్ట ఈ ఐదు అద్భుతాలు గోదావరి అందాలను ఇనుమడింపజేస్తున్నాయి.