News August 10, 2025
పరిటాల చెరువులో రూ. 4 కోట్ల వజ్రం లభ్యం

కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలోని చెరువులో 52 క్యారెట్ల వజ్రం లభించినట్లు సమాచారం. బహిరంగ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ. 4 కోట్లు ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ఈ వజ్రాన్ని రూ. 2.20 కోట్లకు విక్రయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ ప్రాంతాన్ని నిజాం నవాబులు పాలించడం వల్ల ఇక్కడ వజ్రాల వేట కొనసాగుతోందని స్థానికులు పేర్కొన్నారు.
Similar News
News August 13, 2025
చర్చలు విఫలం.. కొనసాగనున్న సినీ కార్మికుల సమ్మె

సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య చర్చలు మరోసారి విఫలమయ్యాయి. దీంతో కార్మికుల సమ్మె కొనసాగనుంది. ‘షరతులతో కూడిన పని విధానాలకు కార్మికులు ఒప్పుకుంటే వేతనాలు పెంచేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు. రూ.2,000 కంటే తక్కువ తీసుకునే వారికి ఒక విధానం, అంతకంటే ఎక్కువ తీసుకునే వారికి మరో విధానాన్ని ప్రతిపాదించాం. మరో 2, 3 సార్లు చర్చలు జరగాల్సి ఉంది’ అని దిల్ రాజు తెలిపారు.
News August 13, 2025
MBNR: దివ్యాంగుల ప్రజావాణికి 19 ఫిర్యాదులు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన వృద్ధులు, దివ్యాంగుల ప్రజావాణికి 19 ఫిర్యాదులు వచ్చినట్టు కలెక్టర్ విజయేందిర బోయి వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగుల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని జరీనా బేగం, తదితరులు పాల్గొన్నారు.
News August 13, 2025
నిర్మల్: రాష్ట్ర సమాచార కమిషన్ కమిషనర్లను సన్మానం

జిల్లా కలెక్టరేట్‌లో సమాచార హక్కు చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరైన రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ డా.చంద్రశేఖర్‌రెడ్డిని కలెక్టర్ అభిలాష అభినవ్ ఘనంగా సన్మానించారు. ఈయనతో పాటు రాష్ట్ర సమాచార కమిషన్ కమిషనర్లు పర్వీన్, భూపాల్‌లను సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి ఉన్నారు.