News March 31, 2024
పింఛన్ల పంపిణీపై సీఎస్‌కు చంద్రబాబు లేఖ

AP: ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లతో పింఛన్ల పంపిణీని నిలిపివేయాలని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో సకాలంలో పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ చీఫ్ చంద్రబాబు లేఖ రాశారు. ఎలాంటి జాప్యం లేకుండా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైన నిధులను అందుబాటులో ఉంచి, పింఛన్ల పంపిణీకి తగు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సీఈవోను కోరారు.
Similar News
News March 25, 2026
ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీలో నేటి నుంచి 3 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని APSDMA వెల్లడించింది. ఇవాళ మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు VZM, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, NTR, అన్నమయ్య, చిత్తూరు, TRPT జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది.
News March 25, 2026
ఆముదం సాగుకు అనువైన రకాలు

☛ DCH-177: పంట కాలం 90-180 రోజులు. ఎకరాకు దిగుబడి: 6-7.5 క్వింటాళ్లు
☛ DCH-519: 90-180 రోజులు. దిగుబడి: 6-7.5 క్వింటాళ్లు
☛ PCH-111: 90-180 రోజులు. దిగుబడి: 7-8 క్వింటాళ్లు
☛ PCH-222: 90-170 రోజులు. దిగుబడి: 7-8 క్వింటాళ్లు
☛ GCH-08: 95-180 రోజులు. దిగుబడి: 7-8 క్వింటాళ్లు
☛ ICH-66: 90-180 రోజులు. దిగుబడి: 7-9 క్వింటాళ్లు
☛ ICH-5: పంట కాలం 90-180 రోజులు. ఎకరాకు దిగుబడి: 7-9 క్వింటాళ్లు
News March 25, 2026
‘రండి చూసుకుందాం’.. USకు ఇరాన్ సవాల్!

ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో వేలాది సైనికులను పశ్చిమాసియాకు పంపాలని అమెరికా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. 20 ఏళ్లుగా తాము దీని కోసమే ట్రైన్ అవుతున్నామని సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రతినిధి అడ్మిరల్ అహ్మదియాన్ పేర్కొన్నారు. ‘ఇంకా దగ్గరకు రండి’ అంటూ సవాల్ విసిరారు. దీన్ని బట్టి ఇరాన్ సైన్యం నేరుగా తలపడేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.


