News August 10, 2025
తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడతాం: ఉత్తమ్

TG: తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును కట్టి తీరుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. దేవాదుల పంపుహౌస్ పరిశీలించిన ఆయన అక్కడి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమైందని తెలిపారు. భూసేకరణ కోసం రూ.67 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. పెండింగ్ బిల్లులనూ త్వరలో మంజూరు చేస్తామన్నారు.
Similar News
News August 11, 2025
భారత డ్యామ్‌ను మిస్సైళ్లతో పేల్చేస్తాం: పాక్ ఆర్మీ చీఫ్

US గడ్డపై నుంచి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత్‌కు హెచ్చరికలు చేశారు. ‘భవిష్యత్తులో తమ దేశానికి భారత్‌తో ముప్పు ఉందని తెలిస్తే సగం ప్రపంచాన్ని మాతో పాటు ధ్వంసం చేస్తాం. సింధూ నదిపై భారత్ డ్యామ్ కట్టే వరకు ఆగి 10 మిస్సైళ్లతో పేల్చేస్తాం. సింధూ నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదు. మాదీ అణ్వాయుధ దేశమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మా వద్ద మిస్సైళ్లకు కొదవ లేదు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
News August 10, 2025
ఈసీ ఆదేశాలు TDP బేఖాతరు చేస్తోందంటూ YCP విమర్శలు

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల ప్రచారం సా.5గంటలతో ముగిసింది. అయినా, స్థానికేతర కూటమి నేతలు ఒంటిమిట్టలో తిష్ట వేశారని YCP నేతలు ఆరోపిస్తున్నారు. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ హరిత హోటల్ వేదికగా టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కూటమి నేతలకు పోలీసులు మద్దతు పలుకుతున్నారని, ఎన్నికల సంఘం దీనిపై యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు.
News August 10, 2025
అల్పపీడనం.. 4 రోజులు అతిభారీ వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆగస్టు 13, 14, 15, 16వ తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. చెట్లు, శిథిలావస్థలో ఉన్న భవనాల కింద, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.