News August 10, 2025

కూకట్‌పల్లి: లవర్‌తో మాట్లాడుతున్నాడని బ్లేడ్‌తో దాడి

image

కూకట్‌‌పల్లి PS పరిధిలో యువకుడిపై బ్లేడుతో దాడి చేసిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. జనతానగర్‌లో వర్ధన్ (33) వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వర్ధన్ తన లవర్‌తో మాట్లాడుతున్నాడని కోపం పెంచుకున్న భాస్కర్ బ్లేడ్‌తో అతడి మెడపైన దాడి చేశాడు. ఈ దాడిలో వర్ధన్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News August 13, 2025

FLASH: HYD: చర్లపల్లిలో యాక్సిడెంట్.. బాలుడు మృతి

image

HYD చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. చర్లపల్లి నుంచి నాగారం వెళ్లే రోడ్డుపై వస్తున్న కారు, బుల్లెట్ బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో బుల్లెట్‌పై ఉన్న బాలుడు(17) మృతిచెందాడు. అతివేగమే ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 13, 2025

HYD: ఎయిర్‌పోర్ట్‌లో మారిన క్యాబ్స్ పికప్ పాయింట్

image

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రయాణికుల సౌలభ్యం కోసం క్యాబ్ పికప్ పాయింట్‌ను మార్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన ప్రయాణికుల వాకింగ్ దూరాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. క్యాబ్ పికప్ పాయింట్ గతంలో C పార్కింగ్‌లో ఉండగా ప్రస్తుతం H పార్కింగ్‌కు మార్చారు. ప్రయాణికులు ఈ విషయం గమనించాలని ఎయిర్‌పోర్ట్ అధికారులు పేర్కొన్నారు.

News August 13, 2025

HYD: బోయిన్‌పల్లిలో హ్యాష్ ఆయిల్ ముఠా అరెస్ట్

image

హ్యాష్ ఆయిల్ ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈరోజు పట్టుకున్నారు. బోయిన్‌పల్లి ICRISAT ఫేజ్-2 గేట్ వద్ద డ్రగ్స్ పెడ్లర్లు సాహూ సోను, బందారి రవితేజను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.8.95 లక్షల విలువైన 1,770 గ్రాముల హ్యాష్ ఆయిల్‌తోపాటు ఒక మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు. ఇద్దరిపై NDPS కింద పూర్వ క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఏపీ నుంచి హ్యాష్ ఆయిల్ తెప్పించి చిన్నప్యాకెట్లుగా ముఠా అమ్ముతోందని గుర్తించారు.