News August 10, 2025
సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం: కోదాడ MLA

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. ఆదివారం కోదాడలో చిరంజీవి యూత్ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండె పంగు రమేశ్ ఆధ్వర్యంలో మెగాస్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని నిర్వహించిన రాష్ట్ర స్థాయి పాటల పోటీల విజేతలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ఉన్నారు.
Similar News
News August 13, 2025
KNR బస్ స్టేషన్‌లో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ

KNR బస్ స్టేషన్ ఆవరణలోని రీజనల్ మేనేజర్ కార్యాలయ సముదాయంలో KNR RM బి. రాజు, డిప్యూటీ RM లు ఎస్.భూపతిరెడ్డి, పి.మల్లేశం సిబ్బందితో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ, ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా వుండడానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ ఆఫీసర్ జి.సత్యనారాయణ, పర్సనల్ ఆఫీసర్ కార్యాలయ సూపరింటెండెంట్ బి.సత్తయ్య తదితరులున్నారు.
News August 13, 2025
గురజాడ స్వగృహాంలో విధ్వంసంపై కలెక్టర్ ఆగ్రహం

మహాకవి గురజాడ అప్పారావు స్వగృహం వద్ద పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంబేద్కర్ బుధవారం ఆదేశించారు. గురజాడ స్వగృహం వద్ద గుర్తు తెలియని అగంతకుడు చేసిన విధ్వంసాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. గురజాడ స్వగృహాన్ని సందర్శించి సమగ్ర నివేదికను ఇవ్వాలని పర్యాటక శాఖకు ఆదేశించారు.
News August 13, 2025
KNR: ‘డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి’

నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం 5వ వార్షికోత్సవం సందర్భంగా SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. ఇక్కడ ఎన్సీసీ కేడేట్స్, విద్యార్థులతో కలిసి మాధక ద్రవ్యాలు నియంత్రణకు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. అనంతరం నషాముక్తభారత్ పోస్టర్ ను ఆవిష్కరించారు.