News August 10, 2025

NRPT: ‘సైబర్ మోసగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

image

సైబర్ మోసగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. పెరుగుతున్న అధునాతన టెక్నాలజీ వాడుకొని సైబర్ కేటుగాళ్లు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాడని చెప్పారు. ఫోన్లకు వచ్చే అనవసరపు లింకులు ఓపెన్ చేయకూడదని, అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ఓటీపీ, ఏటీఎం కార్డు నంబర్ చెప్పకూడదని అన్నారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.

Similar News

News August 13, 2025

కృష్ణా, NTR జిల్లాల పేర్లు మారుస్తారా?

image

జిల్లాల పునర్విభజనపై AP క్యాబినెట్ సబ్‌ కమిటీ బుధవారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో జిల్లాల పేర్లు, సరిహద్దులు మార్పులపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో నూజివీడు, గన్నవరం, పెనమలూరును NTR జిల్లాలో, కైకలూరును కృష్ణా జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేటలను అమరావతిలో కలపనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఉండగా NTR జిల్లాను విజయవాడగా మారుస్తారా! కృష్ణా జిల్లాకు NTR జిల్లా పేరు పెడతారా అనే చర్చ జరుగుతోంది. దీనిపై మీ కామెంట్.

News August 13, 2025

పులివెందుల: కొనసాగుతున్న రీపోలింగ్

image

AP: పులివెందులలో ZPTC ఉప ఎన్నిక రీపోలింగ్ కొనసాగుతోంది. అచ్చవెల్లిలోని 3వ, కొత్తపల్లెలోని 14వ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు మరోసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. నిన్న పలు ఉద్రిక్త పరిస్థితులు జరిగిన నేపథ్యంలో ఈ రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోంది. అటు నిన్న సా.5గంటల వరకు పులివెందులలో 76.44శాతం, ఒంటిమిట్టలో 81.53శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం.

News August 13, 2025

నందిగామ ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోగల కృష్ణానది పరిసర గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో బాలకృష్ణ సూచించారు. ఎగువ ప్రాజెక్టు నుంచి భారీ వరదలు వస్తున్న నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్‌కి వరద నీరు విడుదల అవుతుందన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారుల ఆదేశించారు. కంట్రోల్ రూమ్ నంబర్ 7893053534ను సంప్రదించాలన్నారు.