News August 10, 2025
రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు వేయాలి: మాజీ ఎంపీ భరత్

సర్దార్ పాపన్న గౌడ్‌ను స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు వేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. తొలి తెలుగు బహుజన చక్రవర్తి సర్ధార్ పాపన్నగౌడ్ 375వ జయంతి సందర్భంగా జై గౌడ్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో జాతీయ వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న భరత్ మాట్లాడుతూ..బీసీ రిజర్వేషన్ సాధించే దిశగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News August 13, 2025
ధవళేశ్వరం: ‘నా భర్త ఆత్మహత్య చేసుకోబోతున్నాడు సార్’

ధవళేశ్వరం బ్యారేజీపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోతున్న ఓ యువకుడిని మంగళవారం పోలీసులు కాపాడారు. మనస్తాపంతో బ్యారేజీపై నుంచి దూకేందుకు ప్రయత్నిస్తుండగా, అతని భార్య తన భర్త ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు 112కి ఫోన్ చేసింది. ఎస్పీ ఆదేశాలతో హుటాహుటిన బ్యారేజీపైకి చేరుకున్న పోలీసులు అతడిని కాపాడారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
News August 13, 2025
క్యాన్సర్ సర్వే నిర్వహిస్తాం: మంత్రి సత్యకుమార్

సెప్టెంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా క్యాన్సర్ సర్వే నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. రొమ్ము, సర్వైకల్ వంటి క్యాన్సర్లను గుర్తించేందుకు ఈ NCD-3 సర్వే చేపడతామన్నారు. ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సలహాలు, సూచనలు ఇస్తారని మంత్రి పేర్కొన్నారు.
News August 12, 2025
మార్కెట్ కమిటీల్లో డిజిటల్ విధానం: కలెక్టర్

తూ.గో జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యదర్శులతో కలెక్టర్ ప్రశాంతి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇకపై మార్కెట్ కమిటీ చెక్‌పోస్టుల్లో డిజిటల్ విధానాన్ని అమలు చేయాలని ఆమె ఆదేశించారు. ప్రతి మార్కెట్ కమిటీలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.