News August 10, 2025

రహదారి మీద CMకు రాఖీ కట్టిన కార్పొరేటర్

image

CM రేవంత్‌కు అమీర్‌పేట రహదారి మీద INC మహిళా నేత రాఖీ కట్టారు. శనివారం రాత్రి కురిసిన వానకు మైత్రివనం సిగ్నల్ వద్ద రోడ్డు జలమయమైంది. ఈ నేపథ్యంలోనే CM ముంపు ప్రాంతాల్లో ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు. మైత్రివనం సర్కిల్‌‌లో వాటర్ లాగింగ్‌‌పై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. CM ఆకస్మిక పర్యటన సమాచారం తెలుసుకొన్న కార్పొరేటర్ వనం సంగీత అక్కడికి చేరుకొని ఆయనకు రాఖీ కట్టారు.

Similar News

News August 13, 2025

అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి: హైదరాబాద్ కలెక్టర్

image

మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరిచందన అధికారులకు సూచించారు. బుధవారం నాంపల్లిలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని,మాదక ద్రవ్యాల వినియోగంతో జరిగే నష్టాలను వివరిస్తూ, నివారించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు.

News August 13, 2025

కాచిగూడ: ఐక్యతను పెంచేందుకే ‘హర్ ఘర్ తిరంగా’

image

స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజల్లో ఐక్యత, సమగ్రతను పెంపొందించడానికి ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం చేపట్టినట్లు రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం బర్కత్‌పురలో విద్యార్థులతో కలిసి ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీని నిర్వహించారు. గుజ్జ కృష్ణ, ప్రొఫెసర్ డాక్టర్ జె.అచ్యుతాదేవి, నంద గోపాల్ పాల్గొన్నారు.

News August 13, 2025

సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ కానిస్టేబుల్ మృతి

image

సూసైడ్ అటెంప్ట్‌కు పాల్పడిన కానిస్టేబుల్ తూము కిరణ్‌బాబు(40) ఈరోజు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కిరణ్ 2017లో మీర్‌చౌక్ PSలో పనిచేస్తూ సస్పెండ్ అయ్యాడు. తిరిగి ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఈనెల4న పెట్రోల్ పోసుకొని సూసైడ్‌కు యత్నించాడు. 60% కాలిన గాయాలతో గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. తమను ఆదుకోవాలని భార్య, ఇద్దరు కూతుళ్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.