News March 31, 2024
మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా?
రేపటి నుంచి క్రెడిట్ కార్డుల విషయంలో పలు మార్పులు రానున్నాయి.
★ అద్దె చెల్లింపులపై SBI కార్డు రివార్డ్ పాయింట్లు నిలిచిపోనున్నాయి.
★ బీమా, గోల్డ్, ఫ్యూయల్ కోసం AXIS క్రెడిట్ కార్డు ద్వారా జరిపే చెల్లింపులపై రివార్డ్ పాయింట్లు లభించవు. ఎయిర్‌పోర్టు లాంజ్ యాక్సెస్ పొందాలంటే 3నెలల్లో ₹50వేలు ఖర్చు చేయాలి.
★ ICICI లాంజ్ యాక్సెస్ పొందాలంటే 3నెలల్లో కనీసం ₹35వేలు, YES కార్డుపై ₹10వేలు ఖర్చు చేయాలి.
Similar News
News January 4, 2025
నాగార్జున సాగర్ డ్యామ్‌ను సందర్శించిన అధికారులు
నాగార్జున సాగర్ ప్రాజెక్టును సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్), కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ బోర్డు మేనేజ్‌మెంట్) అధికారులు సందర్శించారు. ప్రాజెక్టులోని నీటిని ఏపీ అధిక శాతంలో వాడుకుంటోందని తెలంగాణ ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అలాగే అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా వారు పర్యవేక్షించారు.
News January 4, 2025
లోయలో పడిన ఆర్మీ ట్రక్.. నలుగురు జవాన్లు మృతి
J&Kలోని బందిపూర్ జిల్లాలో ఆర్మీ ట్రక్ ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి లోయలో పడిపోవడంతో నలుగురు జవాన్లు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గత ఏడాది డిసెంబర్ 24న కూడా ఓ ఆర్మీ వాహనం లోయలో పడిపోవడంతో ఐదుగురు సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే.
News January 4, 2025
తెలుగులో ఉత్తర్వులతో పాలన పారదర్శకం: మంత్రులు
AP: ప్రభుత్వ ఉత్తర్వులను <<15057376>>తెలుగులోనూ<<>> ఇవ్వాలన్న నిర్ణయంపై మంత్రులు అచ్చెన్న, సత్యప్రసాద్, రామ్ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. 90% మంది తెలుగు మాట్లాడే ప్రజలున్న రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా పరిపాలన పారదర్శకంగా మారనుందని తెలిపారు. తెలుగు భాషకు CM సముచిత గౌరవం ఇస్తున్నారని కొనియాడారు. మాతృభాషను గత ప్రభుత్వం అవమానించిందని మండిపడ్డారు.