News August 10, 2025
సిద్దిపేటలో ఆకస్మికంగా తనిఖీలు

సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు పోలీసులు ఆకస్మికంగా వాహన తనిఖీలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, అక్రమ రవాణాను అరికట్టడానికి వాహన తనిఖీ చేపట్టినట్లు సీపీ డాక్టర్ అనురాధ తెలిపారు. జిల్లావ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కింద 76, ఎంవీ యాక్ట్ కింద 425 కేసులు నమోదైనట్లు తెలిపారు.
Similar News
News August 13, 2025
మద్యం వినియోగంలో తెలంగాణ టాప్

TG: మద్యం వినియోగంలో రాష్ట్రం దేశంలోనే టాప్‌లో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి సగటున ఏడాదికి విదేశీ మద్యం, బీరు కోసం రూ.3,061 ఖర్చు చేస్తున్నట్లు NIPFP స్టడీలో తేలింది. జాతీయ సగటు రూ.486 ఉండటం గమనార్హం. అలాగే రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాల్లో సిగరెట్ల కోసం యావరేజ్‌గా ఏడాదికి రూ.624 ఖర్చు చేస్తున్నారు. మరోవైపు వార్షిక వ్యక్తిగత వినియోగ ఖర్చులో సిక్కిం (రూ.1,45,261) అగ్రస్థానంలో ఉంది.
News August 13, 2025
ఆ రెండు నియోజకవర్గాలు ప్రకాశంలోకా ..?

జిల్లాల పునర్విభజనపై AP క్యాబినెట్ సబ్ కమిటీ బుధవారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో జిల్లాల పేర్లు, సరిహద్దులు మార్పులపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గంతో పాటుగా కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కలపనున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలుస్తోంది. ఇలా ఉండగా మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. దీనిపై మీ కామెంట్.
News August 13, 2025
శ్రీశైలం డ్యాం.. మరో రెండు గేట్లు ఎత్తివేత

శ్రీశైలం డ్యాం మరో రెండు గేట్లు ఎత్తి మొత్తంగా 6 గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల, సుంకేసుల, హంద్రీనీవా ద్వారా 1,51,951 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ఏడాదిలో మే నెలలోనే శ్రీశైలానికి వరద ప్రారంభం కావడంతోపాటు మూడవసారి గేట్లను తెరచి సాగర్‌కు నీటిని విడుదల చేయటం విశేషం.