News August 10, 2025
MBNR: పరిశుభ్రమైన ఆహారం అందించకపోతే కఠిన చర్యలు: కలెక్టర్

విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని తిరుమలగిరిలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను ఆదివారం రాత్రి ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డించే భోజనంలో మెనూ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వసతి గృహంలో సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News August 12, 2025
MBNR: పోలీసులు కాంగ్రెస్ కు వంత పాడుతున్నారు: MP

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌కి పోలీసులు వంత పడుతున్నారని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావును మంగళవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై ఆమె స్పందించారు. అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఖండించారు. హర్ ఘర్ తిరంగా దేశభక్తి కార్యక్రమంలో భాగంగా పెద్దమ్మ గుడిలో పూజలకు వెళుతుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ దురాహంకారం, దౌర్జన్యానికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు.
News August 12, 2025
MBNR: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని ఎస్పీ జానకి హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలు, కాజ్‌వేలను దాటవద్దని, ఉద్ధృతంగా ప్రవహించే నదులు, వాగులు, వంకల వైపు వెళ్లవద్దని సూచించారు. సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించకూడదని, చేపల వేటకు వెళ్లకూడదని చెప్పారు. జిల్లాలోని పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
News August 12, 2025
చిన్న చింత కుంటలో అత్యధిక వర్షపాతం

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా చిన్నచింతకుంటలో 34.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. జడ్చర్ల 23.3, నవాబుపేట 20.8, కౌకుంట్ల 20.3, మహమ్మదాబాద్, దేవరకద్ర 18.5, మహబూబ్‌నగర్ అర్బన్18.3, అడ్డాకుల 17.8, మూసాపేట మండలం జానంపేట, హన్వాడ 16.8, భూత్పూర్ 16.5, బాలానగర్ 7.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.