News August 11, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓రేపు కలెక్టరేట్లో ప్రజావాణి.. ఐటీడీఏలో గిరిజన దర్బార్
✓జిల్లా వ్యాప్తంగా శ్రావణమాసం బోనాలు
✓టేకులపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ
✓బూర్గంపాడు: చింతకుంటలో తాగునీటి సమస్య
✓ఆళ్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి
✓భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మందుల కొరత
✓బీసీ రిజర్వేషన్ పై బీజేపీ ద్వంద్వ వైఖరి: సీపీఎం
✓ఇల్లందు: చల్ల సముద్రంలో యూరియా కొరత

Similar News

News August 13, 2025

భువనగిరి: అపోహలు పటాపంచలు.. ఎనిమిది మందికి పునర్జన్మ

image

అవయవదానం చేయడానికి సాధారణంగా ఎవరూ ముందురు రారు. మూఢనమ్మకాలతో వెనకడుగు వేస్తుంటారు. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం వాటిని ఏమాత్రం లెక్క చేయట్లేదు. పుట్టెడు దు:ఖంలోనూ అవయవదానానికి ముందుకొస్తున్నారు. భువనగిరికి చెందిన మెతుకు సతీశ్ 2021లో రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయి మరణించారు. కుటుంబ సభ్యులు సతీష్ అవయవాలను దానం చేసి ఎనిమిది మందికి పునర్జన్మనిచ్చారు. నేడు ప్రపంచ అవయవ దినోత్సవం.

News August 13, 2025

మద్యం వినియోగంలో తెలంగాణ టాప్

image

TG: మద్యం వినియోగంలో రాష్ట్రం దేశంలోనే టాప్‌లో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి సగటున ఏడాదికి విదేశీ మద్యం, బీరు కోసం రూ.3,061 ఖర్చు చేస్తున్నట్లు NIPFP స్టడీలో తేలింది. జాతీయ సగటు రూ.486 ఉండటం గమనార్హం. అలాగే రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాల్లో సిగరెట్ల కోసం యావరేజ్‌గా ఏడాదికి రూ.624 ఖర్చు చేస్తున్నారు. మరోవైపు వార్షిక వ్యక్తిగత వినియోగ ఖర్చులో సిక్కిం (రూ.1,45,261) అగ్రస్థానంలో ఉంది.

News August 13, 2025

ఆ రెండు నియోజకవర్గాలు ప్రకాశంలోకా ..?

image

జిల్లాల పునర్విభజనపై AP క్యాబినెట్ సబ్ కమిటీ బుధవారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో జిల్లాల పేర్లు, సరిహద్దులు మార్పులపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గంతో పాటుగా కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కలపనున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలుస్తోంది. ఇలా ఉండగా మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. దీనిపై మీ కామెంట్.