News August 11, 2025

కొవ్వూరులో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం

image

జాతీయ భావజాలాన్ని ప్రజల్లో పెంపొందిస్తూ భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పడంలో బీజేపీ పార్టీ నిబద్ధతతో పనిచేస్తుందని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు నాగేంద్ర అన్నారు. ఆదివారం కొవ్వూరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రతి పౌరుడు దేశభక్తిని పెంపొందించే విధంగా స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని సూచించారు.

Similar News

News August 13, 2025

ధవళేశ్వరం: ‘నా భర్త ఆత్మహత్య చేసుకోబోతున్నాడు సార్’

image

ధవళేశ్వరం బ్యారేజీపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోతున్న ఓ యువకుడిని మంగళవారం పోలీసులు కాపాడారు. మనస్తాపంతో బ్యారేజీపై నుంచి దూకేందుకు ప్రయత్నిస్తుండగా, అతని భార్య తన భర్త ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు 112కి ఫోన్ చేసింది. ఎస్పీ ఆదేశాలతో హుటాహుటిన బ్యారేజీపైకి చేరుకున్న పోలీసులు అతడిని కాపాడారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News August 13, 2025

క్యాన్సర్ సర్వే నిర్వహిస్తాం: మంత్రి సత్యకుమార్

image

సెప్టెంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా క్యాన్సర్ సర్వే నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. రొమ్ము, సర్వైకల్ వంటి క్యాన్సర్లను గుర్తించేందుకు ఈ NCD-3 సర్వే చేపడతామన్నారు. ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సలహాలు, సూచనలు ఇస్తారని మంత్రి పేర్కొన్నారు.

News August 12, 2025

మార్కెట్ కమిటీల్లో డిజిటల్ విధానం: కలెక్టర్

image

తూ.గో జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యదర్శులతో కలెక్టర్ ప్రశాంతి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇకపై మార్కెట్ కమిటీ చెక్‌పోస్టుల్లో డిజిటల్ విధానాన్ని అమలు చేయాలని ఆమె ఆదేశించారు. ప్రతి మార్కెట్ కమిటీలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.