News August 11, 2025
డిప్యూటీ సీఎంపై కామెంట్స్.. ఫిర్యాదు చేసిన జనసేన నేతలు

ఒంగోలులో అతడు రీ రిలీజ్ సందర్భంగా మహేష్ బాబు అభిమానుల పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు ఆదివారం ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల ఆధ్వర్యంలో పలువురు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాజేష్ పాల్గొన్నారు.
Similar News
News August 13, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. ప్రకాశం కలెక్టర్‌కు మంత్రి స్వామి ఫోన్..!

ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాతో మంత్రి డాక్టర్ స్వామి బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆయన కోరారు.
News August 13, 2025
జిల్లాలో జీఎస్టీ వసూళ్లు పెంచాలి: కలెక్టర్

ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కమర్షియల్ టాక్స్ శాఖ అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా సమీక్ష సమావేశం నిర్వహించారు. రూ. 40 లక్షలు, రూ. 20 లక్షల టర్నోవర్ దాటిన వ్యాపార సంస్థలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. పన్ను లేకుండా సరుకుల రవాణా జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
News August 13, 2025
సంతనూతలపాడు: ఆటో బోల్తా.. మహిళ మృతి

సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట వద్ద బుధవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒంగోలుకు చెందిన పెండ్ర కోటమ్మ (65) అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.