News August 11, 2025

నిర్మల్: రూ.29 కోట్ల బియ్యం గుటుక్కు

image

ముధోల్(M) ముద్గల్‌లోని 2 రైస్ మిల్లులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏషియన్, గణపతి రైస్‌మిల్లులు 2024-25లో సేకరించిన 7,111.448 మె.టల ధాన్యాన్ని CMR ప్రభుత్వానికి ఇవ్వలేదు. అధికారులు తనిఖీ చేసినప్పుడు బియ్యం నిల్వలు కనిపించలేదు. దీనిపై సివిల్ సప్లై DM సుధాకర్ ఫిర్యాదు చేయగా.. మిల్లుల యజమానులు మషరుద్దీన్, శ్రీనివాస్‌‌పై కేసులు నమోదు చేశారు. రూ.29 కోట్ల విలువైన బియ్యం దుర్వినియోగం జరిగినట్లు సమాచారం.

Similar News

News April 18, 2026

కోచ్ వేధిస్తున్నాడు: నీరజ్ చోప్రా

image

కోచ్ నావల్‌సింగ్‌ మానసికంగా వేధిస్తున్నాడని.. తమను, కుటుంబీకులను బూతులు తిడుతున్నాడని ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, పారాలింపిక్ ఛాంపియన్ సుమిత్ అంటిల్ సహా మరికొందరు అథ్లెట్లు ‘సాయ్’కి ఫిర్యాదు చేశారు. మద్యం సేవించి దూషిస్తున్నాడని, పోటీలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన ప్రవర్తన దారుణంగా ఉంటోందని సుమిత్ వాపోయారు. ఇలాంటి వ్యక్తులతో క్రీడావ్యవస్థకే చెడ్డపేరని, తక్షణమే చర్యలు తీసుకోవాలని నీరజ్ కోరారు.

News April 18, 2026

జ్ఞానులకు, అహంకారులకు మధ్య తేడా ఇదే!

image

నిండు నదులు పారు నిల్చి గంభీరమై
వెర్రివాగు పారు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: గొప్ప నదులు గంభీరంగా, నిశ్శబ్దంగా ప్రవహిస్తాయి. కానీ చిన్న వాగులు మాత్రం ఎగిరెగిరి పడుతూ, శబ్దం చేస్తూ వేగంగా ప్రవహిస్తాయి. ఇదేవిధంగా జ్ఞానులు శాంతంగా, నిదానంగా ఉంటారు. అల్పులు మాత్రం తొందరపాటుతో అహంకారంగా మాట్లాడుతారు.
<<-se>>#PADHYAM<<>>

News April 18, 2026

భద్రాచలం, బాసర ఆలయాలకు మహర్దశ

image

TG: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భద్రాచలం, బాసర ఆలయాల అభివృద్ధికి టెండర్లు ఖరారయ్యాయి. ఈ మేరకు రూ.586 కోట్లతో భద్రాచలం, రూ.225 కోట్లతో బాసర దేవస్థానాల అభివృద్ధి పనులు జరగనున్నాయి. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయ పున:నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి <<19580372>>భూమిపూజ<<>> చేయడం తెలిసిందే.