News March 31, 2024
కొమురవెల్లికి పోటెత్తిన జనం

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న తరుణంలో పదకొండవ ఆదివారం మల్లన్న క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. జానపదుల జాతరకు పెట్టింది పేరు కొమురవెల్లి మల్లన్న జాతర.. పట్నాలు, బోనాలు, డోలు చప్పుళ్లు, ఢమరుక నాథాలు, శివసత్తుల శిగాలు, పోతరాజుల విన్యాసాలు జాతరలో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. పోలీసులు భారీగా బందోబస్తు చేపట్టారు.
Similar News
News February 14, 2026
మెదక్: కౌన్సిలర్లుగా వదిన మరదలు

మెదక్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు విజయం సాధించి రికార్డు సృష్టించారు. 3వ వార్డు నుంచి కొటాల లలిత విశ్వం, 4వ వార్డు నుంచి ధరిమిశెట్టి స్వరూప బీఆర్‌ఎస్ తరఫున కౌన్సిలర్లుగా గెలుపొందారు. స్వయానా వదిన, మరదలైన వీరిద్దరూ విజయం సాధించడంతో అవుసులపల్లి, హౌసింగ్ బోర్డు కాలనీల్లో పండుగ వాతావరణం నెలకొంది. బంధువులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
News February 13, 2026
మెదక్ జిల్లాలో కౌంటింగ్ ప్రశాంతం: కలెక్టర్

మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రకటించారు. మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్‌తో కలిసి కౌంటింగ్‌ను పర్యవేక్షించారు. సమన్వయంతో పనిచేసిన అధికారులను, సిబ్బందిని అభినందించారు.
News February 13, 2026
తూప్రాన్: సమంగా ఓట్లు.. డ్రా

తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ మరో విజయం నమోదైంది. మున్సిపాలిటీలోని 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సత్య లింగం, స్వతంత్ర అభ్యర్థి కృష్ణ పై గెలుపొందారు. ఇరువురికి సమంగా 330 ఓట్లు రాగా, డ్రా నిర్వహించారు. డ్రాలో సత్య లింగం గెలుపొందారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. లెక్కింపు కేంద్రం వద్ద గులాబీ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు.


