News August 11, 2025
సైబర్ మోసానికి గురైతే 1930కు ఫోన్ చేయండి

సైబర్ మోసానికి గురైన వారు తక్షణం1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని చిట్వేలు SI నవీన్ బాబు సూచించారు. బాధితులు మొదటి గంటలోనే ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బులు వాపసు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ఫిర్యాదు చేసే సమయంలో పూర్తి వివరాలు తెలుపాలన్నారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అప్రమత్తతే రక్ష అని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News April 20, 2026
GK: ముఖ్యమైన సంస్థలు – హెడ్‌క్వార్టర్స్

* WHO – జెనీవా
* UNESCO – పారిస్
* ILO – జెనీవా
* FAO – రోమ్
* UNICEF – న్యూయార్క్
* IMF – వాషింగ్టన్, డి.సి
* World Bank – వాషింగ్టన్, డి.సి
* WTO – జెనీవా
News April 20, 2026
మెదక్: ఎర్రవల్లి నుంచి జగిత్యాలకు KCR

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేడు సోమవారం సాయంత్రం 4:45 గంటలకు ఎర్రవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో జగిత్యాలకు బయలుదేరనున్నారు. జగిత్యాల కలెక్టరేట్ వద్ద హెలిప్యాడ్‌లో దిగిన అనంతరం నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి సభా ప్రాంగణానికి బయలుదేరి ప్రజాసభలో పాల్గొననున్నారు.
News April 20, 2026
కడప రిమ్స్ వద్ద హత్య.. 11 మంది అరెస్ట్?

కడప రిమ్స్ వద్ద ఇటీవల దస్తగిరి అనే వ్యక్తిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. మారెమ్మ జాతరలో జరిగిన చిన్న వివాదం హత్యకు దారితీసింది. వీరిని న్యాయమూర్తి ముందు హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని కడప డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఎస్సైలను బదిలీ చేసిన విషయం తెలిసిందే.


