News August 11, 2025
బొమ్మూరు: గల్లంతైన యువకుడు మృతదేహం లభ్యం

బొమ్మూరు రాఘవేంద్రనగర్‌కాలనీకి చెందిన వంశీకృష్ణ(18) శనివారం సాయంత్రం స్నేహితులతో కలిసి పుష్కర ఘాట్‌లో గోదావరి స్నానానికి వెళ్లాడు. స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మురళీకృష్ణ గల్లంతయ్యాడు. రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టిన ఆచూకి లభించలేదు. ఆదివారం కుమారిటాకీస్ సమీపంలో దోబీ ఘాట్ వద్ద మురళీకృష్ణ మృతదేహం లభించింది. ఈ మేరకు టుటౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్సై అశ్వక్ కేసు నమోదు చేశారు.
Similar News
News April 18, 2026
నిడదవోలులో ఈనెల 18న సీఎం పర్యటన

సీఎం చంద్రబాబు శనివారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహ కిషోర్ శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలాలను సందర్శించి భద్రతా పరమైన సూచనలు చేశారు. సీఎం రాకపోకల సమయంలో ఎటువంటి అంతరాయం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలన్నారు.

News April 17, 2026
సెన్సస్–2027: స్వీయ నమోదును వినియోగించుకోండి: కలెక్టర్

జనగణన (సెన్సస్–2027)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కల్పించిన స్వీయ నమోదు అవకాశాన్ని జిల్లా ప్రజలందరూ స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రజలు తమ కుటుంబ వివరాలను [https://se.census.gov.in](https://se.census.gov.in) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో స్వయంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.