News August 11, 2025

ఉద్యోగులు, పాత్రికేయులకు క్రీడా పోటీలు: కలెక్టర్

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయుల కోసం క్రికెట్, టగ్ ఆఫ్ వార్, రన్నింగ్, షాట్‌పుట్, క్యారమ్, చెస్ వంటి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12, 13వ తేదీల్లో జనగామలో నిర్వహించబోయే పోటీలకు ఆసక్తి కలిగిన వారు సోమవారం 5 గంటల లోపు పేర్లు సమర్పించాలన్నారు. విజేతలకు ఈ నెల 15న బహుమతులు ప్రదానం చేస్తామన్నారు.

Similar News

News April 18, 2026

అనంత: RDT గుడ్ న్యూస్

image

ఉమ్మడి అనంత జిల్లా ప్రజలకు RDT తీపి కబురు చెప్పింది. 2004లో పేద పిల్లల కోసం ఆ సంస్థ ప్రవేశపెట్టిన విద్యా పథకాన్ని పున:ప్రారంభించేందుకు నిర్ణయించారు. పథకంలో కొన్ని మార్పులు చేసి అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పథకం కింది ఇప్పటి వరకు 5,400 మంది విద్యార్థులు చదువుకున్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కాగానే ప్రకటన చేయనున్నట్లు సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ తెలిపారు.

News April 18, 2026

యురేనియం ఇచ్చే ప్రసక్తే లేదు: ఇరాన్

image

శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎక్కడికీ తరలించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అవి ఎప్పటికీ తమ నియంత్రణలోనే ఉంటాయని విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ తెలిపారు. యురేనియంను ఇచ్చేందుకు ఇరాన్ ఒప్పుకుందని అమెరికా అధ్యక్షుడు <<19670282>>ట్రంప్<<>> చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. రెండు దేశాల మధ్య చర్చల్లో ఈ అంశం ఎన్నడూ ప్రస్తావనకు రాలేదని పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించడంపైనే చర్చలు కేంద్రీకృతమయ్యాయని చెప్పారు.

News April 18, 2026

ఏలూరుకి వస్తున్న ఎంపీ మహేష్

image

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఈ నెల 19న ఏలూరుకి రానున్నట్లు క్యాంపు కార్యాలయ వర్గ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి క్యాంపు కార్యాలయంలో ప్రజలు, నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని అన్నారు. అయితే ఇటీవల ఎంపీ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఆయన తిరిగి ఏలూరుకి రావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.