News August 11, 2025

ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు

image

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో శ్రావణ మాసం విదియ తిథి సోమవారం సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతినిచ్చారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.

Similar News

News April 19, 2026

గురుకుల ఆర్సీఓను తొలగించాలి: లంబాడా హక్కుల పోరాట సమితి

image

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భద్రాచలం గురుకుల ఆర్సీఓను వెంటనే విధుల్లోంచి తొలగించాలని లంబాడా హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. 2023-24 నియామకాలు, బదిలీల్లో భారీగా అక్రమాలు జరిగాయని, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఐటీడీఏ ముట్టడికి దిగుతామని హెచ్చరించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.

News April 19, 2026

చిత్తూరు: చెరువులో పడి ఇద్దరు మహిళలు మృతి

image

గుడిపల్లి (M) కనుమనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో గుడ్డలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బేబీ (19), దుర్గ (21) మృతి చెందారు. వరుసకు అక్క చెల్లెలు అయిన బేబీ, దుర్గ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

News April 19, 2026

అల్లికలతో వ్యసనాలకు చెక్!

image

స్మోకింగ్, గోళ్లు కొరకడం, గంటల తరబడి మొబైల్ చూడటం వంటి వ్యసనాల నుంచి బయటపడటానికి అల్లికలు మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఖర్చుతో కూడిన థెరపీలు, కౌన్సెలింగ్‌లు అవసరం లేదంటున్నారు. ‘అల్లికలు అందంగా ఉండనక్కర్లేదు. చేతులు, కళ్ల కదలికల వల్ల పారాసింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ యాక్టివేటై శరీరం రిలాక్స్ అవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలూ తగ్గుతాయి’ అని పేర్కొంటున్నారు.