News August 11, 2025

హుస్సేన్‌సాగర్‌కు ఓ వైపు వరద.. మరోవైపు విడుదల

image

హుస్సేన్‌‌సాగర్‌కు వరద కొనసాగుతోంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం 513.50 మీటర్లుగా ఉంది. నగరంలో కురిసిన వర్షాలతో సాగర్‌కి వచ్చే నాలాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో సాగర్‌కి ఇన్ ఫ్లో 1027 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 1130 క్యూసెక్కులుగా ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

Similar News

News September 14, 2025

రేవంత్ సర్కార్‌ను జూబ్లీహిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలి: మంత్రి

image

పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా HYDలో మౌలిక సదుపాయాలు కల్పన దిశగా సీఎం రేవంత్ రెడ్డి విజనరీగా పని చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం జూబ్లీహిల్స్ పరిధిలో ఆత్మీయ సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ విశ్వనగరం అజెండాగా అభివృద్ధి చేయాలనే పట్టుదలతో సీఎం పనిచేస్తున్నారన్నారు. ఆయనను, ప్రజా ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలని కోరారు.

News September 14, 2025

HYD: ‘BRS విష ప్రచారాలను తిప్పి కొట్టాలి’

image

గ్రూప్-1 పరీక్షపై BRS చేస్తున్న విష ప్రచారాలను ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తల తిప్పికొట్టాలని రాష్ట గ్రంథాలయ ఛైర్మన్ రియాజ్ పిలుపునిచ్చారు. హైకోర్ట్ తీర్పును తాము ఎల్లప్పుడూ గౌరవిస్తామని స్పష్టంచేశారు. గ్రూప్-1 పోస్టులు అమ్ముకున్నారని మాట్లాడిన KTRపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని BRS నాయకులకు హితవు పలికారు.

News September 14, 2025

జూబ్లీహిల్స్‌లో ప్రజలతో మంత్రుల ముఖాముఖీ

image

జూబ్లీహిల్స్‌లోని సోమాజిగూడ డివిజన్‌లో జయ ప్రకాశ్ కాలనీ, ఇంజినీర్స్ కాలనీ ప్రజలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు ముఖాముఖీ నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజీలు, పలు సమస్యలు స్థానికులు మంత్రికి తెలిపారు. వారు మాట్లాడుతూ.. అధికారులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. సమస్యల వినతులపై పరిష్కారం చేస్తామన్నారు.