News August 11, 2025

9th క్లాస్ విద్యార్థులకు ‘ఓపెన్ బుక్’ పరీక్షలు

image

9వ తరగతి విద్యార్థులకు ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనుంది. ఇందులో భాగంగా లాంగ్వేజ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ పరీక్షలను స్టూడెంట్స్ బుక్స్ చూస్తూ రాయొచ్చు. అయితే స్కూళ్లు దీన్ని అమలుచేయడం తప్పనిసరి కాదని బోర్డు తెలిపింది. మరోవైపు స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేయనుంది.

Similar News

News August 11, 2025

నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు: రాజగోపాల్ రెడ్డి

image

TG: తనకు మంత్రి పదవి ఇస్తామని మాటివ్వడం నిజమేనంటూ ప్రజలకు చెప్పినందుకు Dy.CM <<17365508>>భట్టి <<>>విక్రమార్కకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తూ అవినీతి రహిత పాలన అందించాలని కోరారు. TG స‌మాజ ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేలా కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న ఉండాల‌ని ఆశిస్తున్నానన్నారు.

News August 11, 2025

OFFICIAL: ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదు

image

AP: ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే ఉచిత బస్సు ప్రయాణం పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్‌ల్లోనే ఉంటుందని ప్రభుత్వం GO ఇచ్చింది. బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఐడీ కార్డు చూపించి ప్రయాణించవచ్చంది. నాన్‌స్టాప్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే, పర్యాటక, సూపర్ లగ్జరీ, సప్తగిరి(తిరుమల), ఆల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, AC బస్సుల్లో స్కీమ్ వర్తించదని తెలిపింది.

News August 11, 2025

రూ.100 కోట్లు దాటిన ‘కింగ్డమ్’ కలెక్షన్లు!

image

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ‘కింగ్డమ్’ మూవీ రూ.100 కోట్లకు‌పైగా కలెక్షన్లు సాధించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. విడుదలైన 10 రోజుల్లోనే ఈ ఘనత అందుకుందని తెలిపాయి. ఈ సినిమాకు నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. పార్ట్-2 కూడా ఉందని మూవీ యూనిట్ ప్రకటించింది.