News August 11, 2025
హుస్సేన్‌సాగర్‌కు ఓ వైపు వరద.. మరోవైపు విడుదల

హుస్సేన్‌సాగర్‌కు వరద కొనసాగుతోంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం 513.50 మీటర్లుగా ఉంది. నగరంలో కురిసిన వర్షాలతో సాగర్‌కి వచ్చే నాలాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో సాగర్‌కి ఇన్ ఫ్లో 1027 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 1130 క్యూసెక్కులుగా ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
Similar News
News August 13, 2025
గద్వాల: ఉప్పొంగుతున్న వాగులు.. ప్రవాహాలు దాటవద్దు

గద్వాల జిల్లాలో ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. బుధవారం జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించిన ఆయన బీచుపల్లి పుష్కర ఘాట్‌తో పాటు ఇతర వాగులను పరిశీలించారు. వాగుల వద్ద ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రజలు అటువైపు వెళ్లకుండా చూడాలని స్థానిక పోలీసులకు ఆదేశించారు.
News August 13, 2025
రేపు అనంతపురానికి YS జగన్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. తాడేపల్లి నుంచి గురువారం ఉదయం 9.45 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి ఉ.11.30 గంటలకు అనంతపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇంద్రప్రస్థ GMR గ్రౌండ్స్‌కు చేరుకుని, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి కుమారుడి పెళ్లికి హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం బెంగళూరుకు వెళ్తారు.
News August 13, 2025
ఢిల్లీలో జరిగే వేడుకలకు సారవకోట సీడీపీఓకు ఆహ్వానం

ఢిల్లీలో ఈ నెల 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలకు సారవకోట ఐసీడీఎస్ సీడీపీఓ వంశీ ప్రియకు ఆహ్వానం అందింది. ఢిల్లీలోని రెడ్ పోర్ట్‌లో నిర్వహించే ఉత్సవాలలో ఆమె బయల్దేరనున్నారు. తనని ఎంపిక చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.