News August 11, 2025

1,13,888 మంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు: కలెక్టర్

image

జనగామ జిల్లా వ్యాప్తంగా నిర్వహించబోయే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. 1,13,888 మంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు వేయనున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది చురుకుగా పాల్గొని ప్రతి పిల్లవాడికి మందు అందేలా చూడాలని ఆయన సూచించారు.

Similar News

News April 19, 2026

నల్గొండ: రిజిస్ట్రేషన్ల ‘షాక్’.. సామాన్యుడిపై భారం

image

రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఉమ్మడి జిల్లాలోని పేద, మధ్యతరగతి వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. భూముల విలువను సుమారు 20% మేర పెంచేందుకు కసరత్తు జరుగుతోందని, దీనిపై స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ సిఫారసు చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న స్థలాల ధరలకు తోడు, రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా భారం కానుంది.

News April 19, 2026

చిన్న పొరపాటు చేసినా తీవ్రస్థాయిలో దాడి: ఇరాన్

image

అమెరికాతో దౌత్యానికైనా, పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘేర్ స్పష్టం చేశారు. తాము యుద్ధంలో గెలిచేశామని, ఇప్పుడు చర్చలకు రెడీగా ఉన్నామని తెలిపారు. ఈ సమయంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా, చిన్న పొరపాటు చేసినా తీవ్ర స్థాయిలో బదులిస్తామన్నారు. గత సంఘర్షణలతో పోలిస్తే ఇరాన్ సామర్థ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయని చెప్పారు.

News April 19, 2026

గుల్లకోటలో 44.4℃.. వీణవంకలో 43.6℃

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా గుల్లకోటలో 44.4℃, కోరుట్లలో 44.2℃ నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల (ఐడీఓసీ) 44.3, ఎల్లారెడ్డిపేట 44.1℃ నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా తనుగుల, వీణవంకలో 43.6 చొప్పున నమోదు కాగా, పెద్దపల్లి జిల్లా ఏక్లాస్పూర్, ఆకెనపల్లిలో 43.9 చొప్పున నమోదైంది. తీవ్ర ఎండలతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.