News August 11, 2025

HYDలో వర్షాపాతం అత్యధికంగా నమోదు

image

నగరంలో సాధారణ వర్షపాతాన్ని మించి సగటున 22% అత్యధికంగా నమోదైందని అధికారులు వెల్లడించారు. సిటీవ్యాప్తంగా సాధారణంగా 343 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. గరిష్ఠంగా 439.4 మి.మీ వర్షం నమోదు కావడం గమనార్హం. రంగారెడ్డిలో 292.2 మి.మీటర్ల వర్షపాతానికి 401.7 మిల్లీ మీటర్లు రికార్డు అయ్యింది. మేడ్చల్‌లో 331.0 మి.మీ నమోదు కావాల్సి ఉండగా.. 342.2 మి.మీ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News April 18, 2026

KPHBలో తృటిలో తప్పిన పెను ప్రమాదం!

image

KPHB మెట్రో పిల్లర్ నంబర్ A-834 వద్ద శుక్రవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. గచ్చిబౌలి నుంచి పాలకొల్లు వెళ్తున్న ఈ బస్సులో 18 మంది ప్రయాణికులు ఉండగా, అప్రమత్తతతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.

News April 17, 2026

రంగారెడ్డిలో భానుడి భగభగ.. జనం విలవిల

image

ఉమ్మడి జిల్లాను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భానుడి భగభగలకు జనం విలవిలలాడుతున్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్‌లో 41.8, మేడ్చల్‌లో 41.7 డిగ్రీల వేడి రికార్డయ్యింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. మధ్యాహ్నం వేళ రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.