News March 31, 2024

ఇప్పుడు మళ్లీ ఎందుకు బిందెలు వచ్చాయి?: కేసీఆర్

image

తమ పాలనలో లేని ట్యాంకర్లు, బిందెలు ఇప్పుడు ఎందుకు బయటికొచ్చాయంటూ మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ‘రూపాయికే నల్లా కనెక్షన్, ఫ్రీ వాటర్ ఇచ్చాం. 35వేల కోట్లు ఖర్చుపెట్టి విద్యుత్ రంగాన్ని బాగుచేశాం. 24 గంటలూ కరెంట్ ఇచ్చాం. స్పష్టంగా అర్థమయ్యేదేంటంటే అధికార పార్టీ అవివేకం, తెలివితక్కువతనం, అవగాహనారాహిత్యం క్లియర్‌గా కనిపిస్తోంది. ఉన్న కరెంటును, మిషన్ భగీరథను వాడే తెలివి లేదు’ అని మండిపడ్డారు.

Similar News

News February 3, 2026

పాక్ బాయ్ కాట్.. రూ.2,200కోట్ల నష్టం

image

T20 WCతో భారత్ మ్యాచ్‌ను బాయ్ కాట్ చేస్తామని పాక్ ప్రకటించిన నేపథ్యంలో భారీగా నష్టం కలిగే ఛాన్సుంది. ప్రసార హక్కులు, యాడ్స్ ధరలు, స్పాన్సర్‌షిప్, టికెట్ల విక్రయాలు తదితరాలు కలుపుకొని రూ.2,200CR వరకు లాస్ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు IND-పాక్ బోర్డులకు కలిపి రూ.200CR వరకు నష్టం వాటిల్లొచ్చని చెబుతున్నాయి. ఇది BCCIకి చిన్న విషయమే అయినా పాక్ బోర్డుపై తీవ్ర ప్రభావం చూపనుంది.

News February 3, 2026

ట్రంప్ టారిఫ్స్.. మనకన్నా పాక్, బంగ్లాపైనే ఎక్కువ!

image

ఇండియాపై విధించిన 50% టారిఫ్స్‌ను 18%కు తగ్గిస్తున్నట్లు US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది అమెరికాతో అంటగాగే పాక్, బంగ్లా కంటే తక్కువ కావడం గమనార్హం. బ్రెజిల్‌పై 50%, మయన్మార్-40, లావోస్-40, చైనా-37, సౌతాఫ్రికా-30, వియత్నాం-20, బంగ్లాదేశ్-20, శ్రీలంక-20, పాక్-19, మలేషియా-19, కాంబోడియా-19, థాయ్‌లాండ్‌పై 19% సుంకాలను ట్రంప్ విధించారు. అతితక్కువగా UKపై 10% వసూలు చేస్తున్నారు.

News February 3, 2026

పల్నాడు జిల్లాలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

<>AP: <<>>పల్నాడు DHMOలో 18 పోస్టులకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS, డిప్లొమా/MD/PSM, డిగ్రీ, PG, MBA/PGD, BCom, BSc(సైన్స్), DMLT, శానిటరీ ఇన్‌స్పెక్టర్స్ కోర్సు ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, BCలకు రూ.300. వెబ్‌సైట్: https://palnadu.ap.gov.in