News August 11, 2025
కృష్ణా: కొత్త జిల్లాల మార్పు.. ఆ నియోజకవర్గాలు ఎటు?

కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాల సంఖ్య 32కి పెంచే యోచనలో భాగంగా, కృష్ణా జిల్లాలోని పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి, ఏలూరు జిల్లాలోని నూజివీడును కూడా ఎన్టీఆర్ జిల్లాలోకి, కైకలూరును కృష్ణా జిల్లాలోకి మార్చే అవకాశాలున్నట్లు సమాచారం. పాలనా సౌలభ్యం కోసం ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Similar News
News April 19, 2026
కరీంనగర్: ప్రశాంతంగా మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

కరీంనగర్ జిల్లాలోని 11 తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1,444 మంది దరఖాస్తు చేసుకోగా, 1,263 మంది పరీక్షకు హాజరయ్యారు. 181 మంది గైర్హాజరయ్యారు. కొత్తపల్లి మండలం ఎలగందుల పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖాధికారి అశ్వని తానాజీ వాకడే తనిఖీ చేశారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించినట్లు ఆమె తెలిపారు.
News April 19, 2026
విజయవాడ: APSSDC ఆధ్వర్యంలో కంపెనీ స్పెసిఫిక్ జాబ్ డ్రైవ్!

విజయవాడలోని KP నగర్-లోహియా టవర్స్‌లో ఉన్న క్యాంపస్2కెరీర్ కార్యాలయంలో ఈ నెల 22న కంపెనీ స్పెసిఫిక్ జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు APSSDC అధికారులు తెలిపారు. బీటెక్, డిగ్రీ, పీజీ చదివిన 21-35 ఏళ్లలోపు అభ్యర్థులు జాబ్ డ్రైవ్‌కు హాజరుకావొచ్చని.. ఎంపికైన వారికి నెలకు రూ.15-30వేల వేతనం ఉంటుందన్నారు. అకడమిక్ అడ్వైజర్, టీం లీడర్ (50) ఉద్యోగాలను భర్తీ చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.
News April 19, 2026
అక్షయ తృతీయ.. ప్రకాశంలో బంగారం ధరలు ఇలా..?

అక్షయ తృతీయ కావడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బంగారు దుకాణాలు కళకళలాడుతున్నాయి. పసిడి ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నా.. కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదివారం 24 క్యారెట్ల తులం(10 గ్రాములు) బంగారం ధర రూ.1,54,100గా ఉంది. 22 క్యారెట్ల తులం రూ.1,42,500 పలుకుతోంది.


