News August 11, 2025
గుంటూరు: దిగివస్తున్న పచ్చిమిర్చి ధర

మార్కెట్లో పచ్చిమిర్చి ధరలు నెమ్మదిగా దిగి వస్తున్నాయి. పది రోజుల క్రితం వరకు కిలో పచ్చిమిర్చి రూ.75 నుంచి రూ.80 వరకు ధర పలికాయి. రిటైల్ మార్కెట్ తోపాటు రైతు బజార్లలో కూడా ఇదే పరిస్థితి ఉండేది. వంటింట్లో నిత్యావసరమైన మిర్చి ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా రైతు బజార్లో కిలో పచ్చిమిర్చి రూ.46, రిటైల్ మార్కెట్లో రూ.50 గా ఉంది. ధరలు క్రమంగా తగ్గటం కొంత ఊరటనిస్తోంది.
Similar News
News April 17, 2026
ఆ తప్పులు సరిదిద్దేందుకే డీలిమిటేషన్: షా

దేశంలో 127 నియోజకవర్గాల్లో 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని కేంద్రమంత్రి అమిత్ షా LSలో అన్నారు. ‘ఒక దగ్గర 38 లక్షల మంది ఓటర్లు ఉంటే మరో చోట 6 లక్షల మంది ఉన్నారు. ఇలాంటి నియోజకవర్గాలు దేశంలో చాలా ఉన్నాయి. డీలిమిటేషన్ వల్ల ఇలాంటి తప్పులను సరిదిద్దవచ్చు. ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ కావాలనే డీలిమిటేషన్ ఆపింది. జనాభా లెక్కలకు డీలిమిటేషన్‌ను మేం లింక్ చేయలేదు. కాంగ్రెస్సే చేసింది’ అని స్పష్టంచేశారు.
News April 17, 2026
రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి: IGP

భద్రాద్రి జిల్లాలో చోటుచేసుకున్న రహదారి ప్రమాదాలు, వాటి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై IGP చంద్రశేఖర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దమ్మపేట ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు, రహదారి ప్రమాదాలపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంట్లో ఉన్నప్పుడు సైబర్ మోసాలపై, బయటకు వెళ్లినప్పుడు రహదారి ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. డబ్బు పోతే వస్తుంది కానీ ప్రాణాలు కాదని చెప్పారు.
News April 17, 2026
దిగుమతుల్లో గోల్డ్, సిల్వర్ సరికొత్త రికార్డ్

2025-26లో దేశంలో బంగారం, వెండి దిగుమతుల విలువ జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే బంగారం దిగుమతి విలువ $71.98 బిలియన్లకు పెరిగింది. అయితే పరిమాణం పరంగా 4.76% తగ్గి 721.03 టన్నులకు క్షీణించింది. వెండి దిగుమతి విలువ 150% పెరిగి $12Bకు (7,344.96 టన్నులు) చేరింది. మరోవైపు 15 బ్యాంకులకు గోల్డ్, సిల్వర్ దిగుమతులపై అనుమతిని 2029 మార్చి వరకు పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.


