News August 11, 2025
బాపట్ల: నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ రైళ్లు రద్దు

బాపట్ల జిల్లా మీదగా నడిచే లింగంపల్లి-తిరుపతి, తిరుపతి-లింగంపల్లి (12733/12744) నారయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈనెల 17, 18, 19 తేదీలలో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బాపట్ల, చీరాల, ఒంగోలు పరిసర ప్రాంత ప్రయాణికులు తిరుపతి వైపు వెళ్లేందుకు ఈ రైలును ఎక్కువగా వినియోగిస్తారు. మూడో రైల్వే లైను పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు.
Similar News
News April 18, 2026
అనకాపల్లి: ‘భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలి’

జలధార-నీటి భద్రత ద్వారా భూగర్భ జలాల నీటిమట్టం పెంపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. అనకాపల్లి కలెక్టరేట్‌లో శుక్రవారం ఎంపీడీవోలు, ఇరిగేషన్ అధికారులతో జలధార-నీటి భద్రతపై సమీక్షించారు. గ్రామాల్లో చెరువుల అభివృద్ధి పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించాలని సూచించారు. పంట కాలువల పూడికతీత, గేట్ల మరమ్మతు పనులు చేపట్టి సాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరచాలన్నారు.
News April 18, 2026
‘అరైవ్ అలైవ్’ ప్రచారం కాదు.. ప్రాణాల రక్షణకు వాగ్దానం: సీపీ

‘అరైవ్ అలైవ్’ అనేది కేవలం ప్రచారం మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకోవాలనే బాధ్యత అని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. గజ్వేల్‌లో ఆమె మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా అమూల్యమైన ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడంతో ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం తప్పుతుందన్నారు.