News August 11, 2025
ఎయిర్ ఇండియా ‘ఫ్రీడమ్ సేల్’

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఎయిర్ ఇండియా ‘ఫ్రీడమ్ సేల్’ ఆఫర్ తీసుకొచ్చింది. దేశీయ ప్రయాణాలకు సంబంధించి టికెట్ ధరలు రూ.1,279, విదేశాలకు సంబంధించి రూ.4,279 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. చెక్ ఇన్ బ్యాగేజీకి రూ.200 అదనంగా చెల్లించాలని వెల్లడించింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 15వరకు బుకింగ్స్ అందుబాటులో ఉంటాయంది. ఈ నెల 19 నుంచి 2026 మార్చి 31 వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది.
Similar News
News August 11, 2025
ఆసిమ్ మునీర్ బెదిరింపులు.. భయపడేది లేదన్న భారత్

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ <<17364906>>వ్యాఖ్యలపై<<>> కేంద్రం తీవ్రంగా స్పందించింది. అమెరికా నుంచి ఆయన ప్రేలాపనలు చేయడం సిగ్గుచేటని మండిపడింది. అణుదాడి చేస్తామన్న బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేసింది. జాతీయ భద్రత కోసం కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించింది. అమెరికా మద్దతిచ్చినప్పుడల్లా రెచ్చిపోవడం పాక్ ఆర్మీ చీఫ్‌కు అలవాటుగా మారిందని భారత్ విమర్శించింది.
News August 11, 2025
ముగిసిన దగ్గుబాటి రానా ఈడీ విచారణ

TG: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో సినీనటుడు దగ్గుబాటి రానాను ఈడీ విచారించింది. దాదాపు 4 గంటలపాటు ఆయన్ను అధికారులు ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకున్న రెమ్యునరేషన్, కమీషన్లపై ఆయన్ను ఆరా తీసినట్లు సమాచారం. ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలని రానాకు సూచించారు. కాగా రానాతోపాటు ఇప్పటికే విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్‌ను కూడా ఈడీ విచారించిన విషయం తెలిసిందే.
News August 11, 2025
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ తండ్రి కన్నుమూత

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ జాస్ బట్లర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి జాన్ బట్లర్ కన్నుమూశారు. ‘రెస్ట్ ఇన్ పీస్ డాడ్.. థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్’ అని జాస్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తన తండ్రితో కలిసి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకున్న ఫొటోను షేర్ చేశారు. మృతికి కారణాలు వెల్లడించలేదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, బట్లర్ ధైర్యంగా ఉండాలని కాంక్షిస్తూ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.